కేసీఆర్‌కు సిట్ నోటీసులు గర్హనీయం
మాజీ మంత్రి
పువ్వాడ అజయ్‌కుమార్
మధిర/వైరా: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం హేయమైన చర్య అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మధిర, వైరాలో గురువారం జరిగిన బీఆర్‌ఎస్ శ్రేణుల సమావేశాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. సిట్ విచారణ పేరుతో కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. ప్రజల్లో బీఆర్‌ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా రైతుబంధు, రైతు రుణమాఫీ సంపూర్ణంగా అమలుచేయలేదని, కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం ఊసే లేదని విమర్శించారు. ఇవికాక ఇంకా అమలుచేయని హామీలను ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు పాటుపడాలని అజయ్ సూచించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కుటుంబం అవినీతికి పాల్పడుతుండడమే కాక, బీఆర్‌ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు డబ్బుతో కొనుగోలుకు యత్నిస్తున్నారని ఆరో పించారు. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు భూక్యా వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ విస్మరించిన హామీలను ప్రజల్లోకి
తీసుకెళ్దాం


