కొనసాగుతున్న ఉమెన్ టీ–20 క్రికెట్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఇందిరాగాంధీ సీనియర్ మహిళల టీ–20 క్రికెట్ టోర్నీ కొనసాగుతోంది. మూడో రోజు పోటీల్లో భాగంగా మహారాష్ట్ర – ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా తొలుత బ్యా టింగ్ చేసిన మహరాష్ట్ర నిర్ణీత ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 197 పరుగులు చేసింది. జట్టులో మిథాలీ శర్మ 96 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 116 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించడం విశేషం. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రప్రదేశ్ జట్లు 29 ఓవర్లలో 128 పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. ఉత్తరాఖండ్ – ఉత్తరప్రదేశ్ మధ్య మ్యాచ్‌లో ఉత్తరాఖాండ్, విదర్భ – ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్‌లో విదర్భ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లను మాజీ మిస్ ఇండియా డాక్టర్ పర్హా ప్రారంభించగా, బ్యాంక్ మేనేజర్ శివకుమార్‌తో పాటు ఎం.డీ.మతిన్, జానీ, జోజిచాకో తదితరులు పాల్గొన్నారు.


