స్టాచ్యూ సెంటర్ !
అన్ని పట్టణాలు, గ్రామాల్లో జాతీయ నేతలు, మహనీయుల విగ్రహాలు ఏర్పాటుచేయడం
ఆనవాయితీ. కానీ వీధికొకటి అన్నట్లుగా, మరికొన్ని విగ్రహాలు ప్రధాన రహదారుల మధ్యలో ఉంటాయి. అయితే, సత్తుపల్లికి ఈ అంశంలో ప్రత్యేకత ఉంది. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారి పక్కన జాతీయ నాయకుల విగ్రహాలు వరుసగా ఏర్పాటు చేశారు. జయంతి, వర్ధంతి సందర్భాలతో పాటు ఇతర ప్రత్యేక రోజుల్లో ఇక్కడ నివాళులర్పిస్తుండడంతో ఇది స్టాచ్యూ సెంటర్‌గా మారింది. రహదారి పక్కన ఉండడంతో ఎంత మంది హాజరైనా సమస్యలు ఎదురుకావడం లేదు. ఇక్కడ గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజీవ్‌గాంధీ, ఇందిరా
గాంధీ, వల్లభాయ్‌పటేల్, జ్యోతిరావుపూలే, డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, ఎన్టీఆర్, చాకలి ఐలమ్మ, వడ్డెర ఓబన్న, కుమురం భీమ్, వంగవీటి రంగ తదితరుల విగ్రహాలు ఉన్నాయి.
– సత్తుపల్లిటౌన్
రహదారి పక్కన జాతీయ నాయకుల విగ్రహాలు


