మిస్ట్ అధ్యాపకుడికి డాక్టరేట్
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లిలోని మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ తాళ్లూరి మహేశ్వరరావుకు డాక్టరేట్ లభించింది. ‘బిహేవియర్ ఆఫ్ ప్లగ్జరల్ మెంబర్స్ విత్ పార్షి యల్ రీప్లేస్‌మెంట్ ఆఫ్ సిమెంట్ విత్ జీజీబీఎస్ అండ్ ఫైన్ అగ్రిగేట్ ఇన్ కార్పొరేటింగ్ క్లాసింక్ శాండ్’ అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథం సమర్పించగా తమిళనాడులోని అన్నామలై యూని వర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఈసందర్భంగా మహేశ్వరరావు ను ప్రిన్సిపాల్ చలసాని హరికృష్ణ, కరస్పాండెంట్ చలసాని సాంబశివరావు, అధ్యాపకులు సాయి ఇంద్రసేనారెడ్డి, రామచంద్రరావు మంగళవారం అభిందించారు.
నేటి నుంచి శిక్షణ
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని పీఎంశ్రీ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు ఈనెల 28నుంచి 31వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఖమ్మంలోని డైట్ కళాశాల, టేకులపల్లిలోని గురుకుల కళాశాలల్లో ‘కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ద యూసెజ్ ఆఫ్ ఐసీటీ టూల్స్’ అంశంపై శిక్షణ ఉంటుంది.
‘మంచుకొండ’ నుంచి నీటి విడుదల
రఘునాథపాలెం: మండలంలోని వీవీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా మంగళవారం నీటిని విడుదల చేశారు. చెరువులకు నీరు అందించేందుకు గాను ఒక మోటార్‌ను ఆన్ చేసి నీరు విడుదల చేశామని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ నీటిని మల్లెపల్లిలోని రేగులకుంట చెరువుకు మళ్లించినట్లు పేర్కొన్నారు.
త్వరలోనే పూర్తిస్థాయి వైద్యసేవలు
పెనుబల్లి: పెనుబల్లిలోని నూతనంగా నిర్మించిన 50 పడకల ఆస్పత్రి ద్వారా త్వరలోనే పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్‌గౌడ్ తెలిపా రు. ఆస్పత్రికి మంగళవారం పరిశీలించిన ఆయన కావాల్సిన పరికరాలపై వైద్యాధికారి కిరణ్‌కుమార్‌తో చర్చించారు. గతంలో సింగరేణి సంస్థ ఇచ్చిన రూ.5.90 లక్షలతో దంత వైద్య పరికరాలు, ఆపరేషన్ టేబుళ్లు, ఇతరత్రా కొనుగోలు చేశామని తెలిపారు. ఇవికాక మిగతావి త్వరలో సమకూరుస్తామని డీసీహెచ్‌ఎస్ వెల్లడించారు. వైద్యులు రంజిత్, వరుణ్, సృజన, ఉద్యోగులు పాల్గొన్నారు.
మిస్ట్ అధ్యాపకుడికి డాక్టరేట్
మిస్ట్ అధ్యాపకుడికి డాక్టరేట్


