మహిళా క్రికెటర్లకు ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళా క్రికెటర్లకు ఉజ్వల భవిష్యత్‌

Jan 31 2026 7:15 AM | Updated on Jan 31 2026 7:15 AM

మహిళా

మహిళా క్రికెటర్లకు ఉజ్వల భవిష్యత్‌

ఖమ్మం స్పోర్ట్స్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు ఐసీసీ ట్రోఫీ గెలిచాక మహిళా క్రికెట్‌ర్లకు మరింత ఆదరణ పెరిగిందని.. ఇందులో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఇందిరాగాంధీ ఐదోజాతీయ సీనియర్‌ మహిళా టీ–20 క్రికెట్‌ టోర్నీ కొనసాగుతుండగా ఎంపీ శుక్రవారం క్రీడాకారులకు పౌష్టికాహారం కిట్లు అందజేసి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వాన రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఎంపీ కాసేపు క్రీడాకారులతో కలిసి క్రికెట్‌ ఆడారు. అలాగే, స్టేడియంలో సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, కార్పొరేటర్‌ మిక్కిలినేని మంజుల నరేందర్‌తో పాటు ఎంజీవీ.ప్రవీణ్‌కుమార్‌, కొప్పుల చంద్రశేఖర్‌, తుమ్మా అప్పిరెడ్డి, టోర్నీ నిర్వాహకులు ఎం.డీ.మతిన్‌, జానీపాషా తదితరులు పాల్గొన్నారు.

ఫైనల్స్‌కు చేరిన ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖాండ్‌

టీ–20 క్రికెట్‌ టోర్నీలో భాగంగా శుక్రవారం సెమీస్‌ నిర్వహించారు. తొలిమ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌– విదర్భ జట్లు తలపడగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఉత్తరప్రదేశ్‌ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 142 పరుగులు అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విదర్భ జట్టు 128 పరుగులే చేయడంతో ఓటమి పాలవగా ఉత్తరప్రదేశ్‌ జట్టు ఫైనల్స్‌కు చేరింది. రెండో సెమీస్‌లో ఉత్తరఖాండ్‌ – ఢిల్లీ జట్లు తలపడగా ఉత్తరఖాండ్‌ జట్టు ఘనవిజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ జట్టులో సాక్షి వాగ్‌మోడే 56 బంతుల్లో 106 పరుగులు చేసింది. కాగా, శనివారం ఉదయం ఫైనల్స్‌ నిర్వహించనున్నారు.

ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి

మహిళా క్రికెటర్లకు ఉజ్వల భవిష్యత్‌1
1/1

మహిళా క్రికెటర్లకు ఉజ్వల భవిష్యత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement