దుమ్మూదూళి నడుమ భోజనం చేయలేం...
● విధులు బహిష్కరించిన సింగరేణి కార్మికులు
సత్తుపల్లిరూరల్: దుమ్మూదూళి నడుమ భోజనం చేయలేమంటూ సత్తుపల్లి మండలం జేవీఆర్ సింగరేణి ఓసీలో కార్మికులు గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సింగరేణి క్యాంటీన్‌లో కాకుండా ఓసీ ఇంటర్నల్ పార్కింగ్ యార్డులో నిర్మించిన షెడ్డులో భోజనం చేయాలని యాజమాన్యం ఆదేశించింది. అయితే, సీహెచ్‌పీ నుంచి దుమ్ము వెలువడే ప్రాంతంలో షెడ్డు నిర్మించడం సరికాదంటూ కార్మికులు విధులు బహిష్కరించారు. యాజమాన్యం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


