ఖమ్మం జిల్లా: తల్లాడ మండలం రామానుజవరం సర్పంచ్‌గా బుధవారం జరిగిన ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి కిన్నెర వెంకటకృష్ణవేణి గెలుపొందారు. ఆమెకు దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి, ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అభిమానుల మద్దతు ఉండడంతో ఫలితం వెలువడగానే సంబురాలు చేసుకున్నారు. ఈక్రమాన జగన్ ఫొటోతో సంబురాల్లో పాల్గొని తమ కృతజ్ఞత చాటుకున్నారు.


