ఇంద్రవెల్లి: రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
ఆదివారం ఉదయం నుంచి మెస్రం వంశీ యులు ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా సంప్రదాయ పూ జలు నిర్వహించారు.
ముందుగా కేస్లాపూర్‌లో ని నాగోబా మురాడి నుంచి నాగోబా విగ్రహం, పూజ సామగ్రితో బయలుదేరారు. డోలు, తుడుం, కాలీకోమ్, పెప్రే వాయిస్తూ పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న మైసమ్మ దేవతకు పూజలు నిర్వహించి లోనికి ప్రవేశించారు. నాగోబా దర్శన అనంతరం సంప్రదాయ పూజలు నిర్వహించారు.
సంప్రదాయ పూజల అనంతరం రాత్రి 9నుంచి 10.30 గంటల వరకు పాదయాత్ర ద్వారా తీసుకువచ్చిన పవిత్ర గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. నాగోబాను అభిషేకించి మహాపూజ నిర్వహించారు. (ఈ సమయంలో మెస్రం వంశీయులు మినహా ఇతరులను అనుమతించలేదు)


