కేశవపట్నంలో ఉద్రిక్తత.. ఫారెస్ట్ సిబ్బందిపై పోడు రైతుల రాళ్లదాడి.. | Adilabad District: Podu Farmers Stone Attack On Forest Personnel | Sakshi
Sakshi News home page

కేశవపట్నంలో ఉద్రిక్తత.. ఫారెస్ట్ సిబ్బందిపై పోడు రైతుల రాళ్లదాడి..

Jul 20 2025 1:30 PM | Updated on Jul 20 2025 2:53 PM

Adilabad District: Podu Farmers Stone Attack On Forest Personnel

సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బంది, పోలీసులపై పోడు రైతులు దాడి చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ రాళ్లతో​ దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఆందోళనకారుల దాడిలో పోలీస్ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. 

ఫారెస్ట్, పోలీస్, మీడియా సిబ్బందికి గాయాలవ్వగా వారిని ఇచ్చోడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో.. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement