Hanuman Idol found In Adilabad - Sakshi
Sakshi News home page

హనుమాన్‌ విగ్రహం లభ్యం!

Jul 28 2023 12:38 PM | Updated on Jul 28 2023 1:10 PM

 Hanuman Idol Available - Sakshi


ఆదిలాబాద్‌: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని కన్నెపెల్లి శివారులోని వాగులోకి కొట్టుకువచ్చిన హనుమాన్‌ విగ్రహం బాలుడికి లభించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కన్నెపెల్లికి చెందిన స్వాతిక్‌ అనే బాలుడు పత్తి చేనులో పక్కనే ఉన్న వాగు పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటున్నాడు.

అక్కడ రంగులతో కూడిన రాయి కనిపించగా వెళ్లి చూసే సరికి హనుమాన్‌ విగ్రహం ఉందని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ విషయం ప్రజలకు తెలియడంతో పెద్ద ఎత్తున విగ్రహాం వద్దకు చేరుకుని పూజలు చేశారు. ఈ విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్టిస్తామని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement