ఏఐఎఫ్‌బీలో పలువురి చేరిక | - | Sakshi
Sakshi News home page

ఏఐఎఫ్‌బీలో పలువురి చేరిక

Feb 2 2026 7:29 AM | Updated on Feb 2 2026 7:29 AM

ఏఐఎఫ్‌బీలో పలువురి చేరిక

ఏఐఎఫ్‌బీలో పలువురి చేరిక

ఆదిలాబాద్‌టౌన్‌: ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ)లో పలువురు చేరారు. మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రంగినేని మనీషా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో పార్టీ ఆధ్వర్యంలో ఆది వారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. టైగర్‌ గ్రూప్‌నకు సంబంధించిన సభ్యులతో పాటు పలువురు కాలనీవాసులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో ఏఐఎఫ్‌బీ అభ్యర్థులను సింహం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తమ పార్టీ ప్రజల ప్రయోజనాలు, మార్పు కోసం అడుగులు వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement