ఆర్కేపీ ఓసీపీని పరిశీలించిన కేంద్ర బృందం | - | Sakshi
Sakshi News home page

ఆర్కేపీ ఓసీపీని పరిశీలించిన కేంద్ర బృందం

Apr 3 2026 7:56 AM | Updated on Apr 3 2026 7:56 AM

రామకృష్ణాపూర్‌: మందమర్రి ఏరియాలో అమలు చేస్తున్న పర్యావరణ పరిరక్షణ చర్యలను కేంద్ర పర్యావరణ శాఖ ఉన్నతాధికారుల బృందం గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన సలహాదారు తరుణ్‌ కత్తుల నేతృత్వంలోని బృందం సింగరేణి కార్పొరేట్‌ జీఎం (ఎన్విరాన్‌మెంట్‌) సైదులు, ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి రామకృష్ణాపూర్‌ ఓపెన్‌కాస్ట్‌ గని పరిసర ప్రాంతాలను సందర్శించింది. ఓసీ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న కాలుష్య నియంత్రణ చర్యలు, ట్రావెలింగ్‌ రోడ్ల వెంట నిర్వహిస్తున్న ఎవెన్యూ ప్లాంటేషన్‌, గని పరిసరాల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం జీఎల్‌ ప్రసాద్‌, ఓసీ మేనేజర్‌ పంకజ్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఆఫీసర్‌ వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement