బీఆర్‌ఎస్‌ కంచుకోట బోథ్‌లో ఉత్కంఠ!

Adilabad: Who Will Be Next Incumbent in Boath Constituency - Sakshi

నియోజకవర్గం : బోథ్‌

మండలాలు : 7(బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసి, భీమ్‌పూర్‌, తలమడుగు, బజరాత్నూర్)

మొత్తం ఓటర్లు : 2,0,1034

ఒకప్పుడు మావోయిస్టు కోట ఉన్న బోథ్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ కంచుకోటగా మారింది. కానీ ఎమ్మెల్యే తీరుతో బీఅర్ఎస్ కోట బద్దలవుతోంది. ఎమ్మెల్యేపై సోంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. ఇక అధిష్టానం కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు కాకుండ కొత్త అభ్యర్థి పేరు ప్రకటించింది. ఈసారి టికెట్‌ను అనిల్‌ జాదవ్‌కు కట్టబెట్టింది. దాంతో బోథ్‌ ఎన్నికలు వెడేక్కాయి. ఇక ముందు నుంచే అధిష్టానం అభ్యర్థి మార్పుపై సంకేతాలు ఇస్తూ రావడంతో బీఆర్‌ఎస్‌లో ఆశావాహులు సంఖ్య పెరిగిందట. టికెట్‌ అనిల్‌ జాదవ్‌కు ప్రకటించడంతో బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన ఆశావాహులు అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎంపి సోయం బాపురావు ఏ పార్టీ రంగంలో  దిగుతారు? అనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ నుండి పోటి చేయడ ఖాయమైందా? లేదంటే కమలం నుండి పోటీ చేస్తారా? భోథ్‌లో ఎన్నికల వార్‌పై సాక్షి  స్పెషల్ రిపోర్ట్.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో సుందరమైన జలపాతాలు ఉన్నా ప్రాంతం. ప్రధానంగా కుంటాల, పోచ్చేర, గాయత్రి, కనకాయి జలపాతాలు ఉన్న అద్భుతమైన ప్రాంతం. ఈ నియోజకవర్గంలో బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసి, భీమ్‌పూర్‌, తలమడుగు, బజరాత్నూర్ మండలాలు ఉన్నాయి. ఇక్కడ 2,0,1034 ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో  గోండులు అత్యదికంగా ఉన్నారు. వీరే  గెలుపు ఓటములను  ప్రభావితం చేస్తారు. 

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలల్లో ప్రజల్లో దూసుకపోతుంది గులాబీ పార్టీ. కానీ, ఈ నియోజకవర్గంలోఎమ్మెల్యే వ్యవహర శైలి పార్టీ తలనోప్పిగా మారింది. అవినీతి అరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ  టిక్కేట్  ఇస్తే ఓటమి  ఖాయమట. అలాంటి వారికి టిక్కెట్ ఇస్తే పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని సర్వేలలో తెలిందట. అలాంటి నియోజకవర్గాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం నుండి పార్టీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రాతినిధ్యం  వహిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్లీ మూడోసారి పోటీ చేయాలని ఉత్సహం చూపిస్తున్నారు.

కానీ పార్టీ నిర్వహించిన సర్వేలలో ప్రజల్లో వ్యతిరేకత అవినీతి అరోపణలు ఎదుర్కోంటున్నారు ఎమ్మెల్యే రాథోడ్  బాపురావు. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అభివృద్ధి చేసింది అంతంత మాత్రమే నట. దీనికి తోడు ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు  మచ్చగా మారిందట. ప్రజలతో అనుబంధం లేదట. పార్టీనాయకులతో సఖ్యత లేదట. అభివృద్ధి పనుల నుండి సర్కార్ సంక్షేమ. పథకాలలో అడ్డగోలుగా అవినీతికి పాల్పపడ్డారని  ఎమ్మెల్యేపై  అరోపణలు ఉన్నాయట. దళితబంధులో  ఎమ్మెల్యే అనుచరులు లూటీ  దందా సాగించారని ప్రచారం ఉంది. అదేవిధంగా జలపాతాలు ఉన్నా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయలేదు.

సాగునీరు అందించడానికి కుప్టి నిర్మించలేదు. నియోజకవర్గంలో డిగ్రీ కళశాల లేదు. ఎళ్లుగా కళశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. రేవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇక అనేక మారుమూల గూడాలకు రవాణా సౌకర్యం లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేయలేదు. పైగా ఈ అవినీతి ఆరోపణలే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు  టిక్కెట్  ఎసరు  తెచ్చిందని అంటున్నారు. ఓడిపోయే అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వలేమని సీఎం కేసీఅర్ బాపురావుకు తేగేసి చెప్పారట.

గత పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ తరపున ఎంపీ సోయం బాపురావు పోటీ చేసి విజయం సాదించారు. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేగా బీజేపీ తరపున పోటీకి సిద్దమవుతున్నారు. అయితే సోయం బీజేపీ నుండి పోటీ చేస్తారా? లేదంటే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. అదివాసీల మద్దతున్నా సోయం బాపురావు బలమైన అభ్యర్థి. మాజీ  ఎంపి నగేష్పే  గతంలో   ఓడించారు సోయం.. కానీ  మాజీ ఎంపి  నగేష్   మళ్లీ   ఎంపిగా పోటీ చేస్తారని  పార్టీ  వర్గాలలో ప్రచారం సాగుతోంది. సీఎం కేసీఆర్ కూడా దేశంలో పట్టుసాదించాలని భావిస్తున్నారు. దేశంలో బీఅర్ఎస్ కీలకపాత్ర పోషించాలంటే ఎంపీ సీట్లు కీలకం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగేష్‌ను ఎంపిగా పోటీ చేయిస్తారని పార్టీలో చర్చ సాగుతుందట.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-11-2023
Nov 09, 2023, 16:38 IST
బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ రెండు చోట్ల ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు.. 
09-11-2023
Nov 09, 2023, 15:40 IST
కామారెడ్డికి కేసీఆర్‌ ఒక్కడే రాడని.. కేసీఆర్‌ వెంట చాలా వస్తాయని బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో.. 
09-11-2023
Nov 09, 2023, 13:15 IST
కథలాపూర్‌ (వేములవాడ): ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు సహజం. ప్రజాప్రతినిధులకు మాత్రం పదోన్నతులు ఉండవు. కానీ కథలాపూర్‌ జెడ్పీటీసీలుగా పదవీ బాధ్యతలు...
09-11-2023
Nov 09, 2023, 12:40 IST
సాక్షి, వరంగల్‌: జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. నవంబర్‌ 30న ఎన్నికలు ఉండడంతో ప్రత్యర్థి ఎత్తులను చిత్తు...
09-11-2023
Nov 09, 2023, 11:28 IST
నల్లగొండ: జిల్లాలో నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. ఈ నెల 10న నామినేషన్ల ఘట్టానికి తెరపడనుంది. ఈ నెల...
09-11-2023
Nov 09, 2023, 11:13 IST
హైదరాబాద్: శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ ఆస్తులు రూ.44,79,93,000 కాగా అప్పులు రూ.96, 34,167గా ఉన్నాయి....
09-11-2023
Nov 09, 2023, 10:08 IST
హైదరాబాద్:  మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి స్థిర ఆస్తులు విలువ(భూములు, భవనాల విలువ) రూ.90,24,08,741...
09-11-2023
Nov 09, 2023, 09:48 IST
సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లా ఎంతో మందికి మంచి పదవులను అందించి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టింది. ప్రముఖులుగా చరిత్రలో లిఖించింది....
09-11-2023
Nov 09, 2023, 08:40 IST
మహబూబ్‌నగర్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌షో విజయవంతమైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,...
09-11-2023
Nov 09, 2023, 08:32 IST
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: హైదరాబాద్‌ సంపదపై ఆంధ్రావాళ్లు కన్నేశారని, వారికి వంతపాడుతున్న కాంగ్రెస్‌, బీజేపీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇరువై ఏళ్లుగా...
09-11-2023
Nov 09, 2023, 07:46 IST
సాక్షి, ఆదిలాబాద్‌: భైంసా మండలం బడ్‌గాం గ్రామానికి చెందిన బోస్లే గోపాల్‌రావుపటేల్‌ – కమలాబాయి దంపతులకు ఇద్దరు కుమారులు. బోస్లే...
09-11-2023
Nov 09, 2023, 07:33 IST
మేరే భారే మే జల్దీ మాముకు బోల్‌ దేరేం.. కుచ్‌ బీ నహీ హువా తోబీ మాముకు బోల్‌ రేం..(నేను...
09-11-2023
Nov 09, 2023, 07:31 IST
హైదరాబాద్ అధికార పక్షం దోస్తీ కోసం పాతబస్తీకే పరిమితమై ఎన్నికల బరిలో దిగే మజ్లిస్‌ పార్టీ ఈసారి అదనంగా మరో...
09-11-2023
Nov 09, 2023, 07:29 IST
మెరుగైన సామాజిక భవిష్యత్‌ను నిర్ణయించేది ఓటు హక్కు మాత్రమే. మంచి నాయకులను ఎన్నుకోవడానికి సరైన సమయం ఇదే. ఎన్నికల వేళ...
09-11-2023
Nov 09, 2023, 05:14 IST
సాక్షి, హైదరాబాద్‌:  ‘‘రైతుబంధు పెద్దవాళ్లకే ఇస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. నాకు రెండెకరాలు ఉంది. సంవత్సరానికి 20వేలు వస్తుంది పెట్టుబడికి. మరొకాయనకు...
09-11-2023
Nov 09, 2023, 05:07 IST
సాక్షి, ఆదిలాబాద్‌:  వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్‌ ఖేల్‌ ఖతం అవుతుందని, దుకాణం బంద్‌ అవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి...
09-11-2023
Nov 09, 2023, 03:56 IST
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, ఆసిఫాబాద్‌:  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఏమీ లేకుండేదని.. ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఒక్కొక్కటీ సర్దుకుంటూ...
09-11-2023
Nov 09, 2023, 02:03 IST
సీఎం కేసీఆర్‌.. ఈ సార్‌తో ఎన్నికల్లో పోటీ అంటే.. అస్స లు మామూలు విషయం కాదు.. ఎప్పుడో నలభై ఏళ్ల...
09-11-2023
Nov 09, 2023, 01:46 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/ కరీంనగర్‌టౌన్‌: రాష్ట్రంలో బీఆర్‌ఎస్సో, కాంగ్రెస్సో అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు వచ్చే ప్రమాదముందని బీజేపీ జాతీయ...
08-11-2023
Nov 08, 2023, 19:07 IST
కాంగ్రెస్‌ సృష్టించే సునామీలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. 

Read also in:
Back to Top