ఆకట్టుకున్న మోడల్‌ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న మోడల్‌

Feb 12 2026 7:20 AM | Updated on Feb 12 2026 7:20 AM

ఆకట్ట

ఆకట్టుకున్న మోడల్‌

న్యూస్‌రీల్‌

స్థానికేతర ఓటర్లకు చుక్కెదురు

ప్రశాంతంగా ‘పుర’ పోలింగ్‌ 69.04 శాతం నమోదు గతంతో పోల్చితే స్వల్పంగా తగ్గుదల కనిపించని స్వీప్‌ ప్రచార ప్రభావం కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ స్ట్రాంగ్‌ రూంలకు చేరిన బ్యాలెట్‌ బాక్స్‌లు

ఖుర్షీద్‌నగర్‌ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు బారులుతీరిన ఓటర్లు

చంటిబిడ్డతో

వచ్చి ఓటేసిన తల్లి

ఎన్నికలు జరిగిన

వార్డులు : 49

సిరా చుక్క చూపుతున్న యువతి

పోలింగ్‌ కేంద్రాలు

: 216

పోలైన ఓట్లు : 99,183

మొత్తం ఓటర్లు : 1,43,655

మహిళలు : 49,926

పురుషులు : 49,256

పోలింగ్‌ శాతం : 69.04

ఇతరులు: 01

ఓటు వేసేందుకు కేంద్రానికి వచ్చిన వృద్ధుడికి

సాయం చేస్తున్న పోలీసులు

కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పోలింగ్‌ ప్ర శాంతంగా ముగిసింది. 49 వార్డులకు గాను బుధవారం ఎన్నికలు నిర్వహించారు. చెదురుముదురు ఘటనలు మినహా ప్రక్రియ సాఫీగా సాగింది. ఉద యం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం వరకు ఓటింగ్‌ ప్రక్రియ మందకొడిగా సాగింది. ఆ తర్వాత ఓటర్లు తరలిరావడంతో పుంజుకుంది. సాయంత్రం ఐదు గంటల్లోపు కేంద్రాలకు చేరుకున్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో 69.04 శాతం పోలింగ్‌ న మోదైంది. 2020 సంవత్సరం ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్‌ శాతం స్వల్పంగా తగ్గింది. పోలింగ్‌ శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం స్వీప్‌ ద్వారా చేపట్టిన ప్రచారం ఎలాంటి ప్రభావం చూపలేక పోయింది. దివ్యాంగులు, వృద్ధులు, అనారో గ్యంతో బాధపడుతున్న ఓటర్లను కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక సిబ్బందితో పాటు వాహన సౌకర్యం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు తలెత్తకుండా ఆయా కేంద్రాల వద్ద పకడ్బందీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. 163 బీఎన్‌ఎస్‌ (144)అమలు చేశారు. పలు పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పరిశీలించారు. పోలింగ్‌ నిర్వహణపై ఆరా తీఽశారు. అలాగే వెబ్‌ కాస్టింగ్‌ ద్వారానూ పోలింగ్‌ సరళిని టీటీడీసీ నుంచి కలెక్టర్‌ పర్యవేక్షించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా వినియోగించుకున్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో టీటీడీసీలోని రిసెప్షన్‌ సెంటర్‌కు చేరుకున్నారు.

ప్రత్యేక వసతులు

ఓటు వేసేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు వసరమైన వసతులను కల్పించారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో షామియానాలు, తాగునీటి ఏర్పాటుతో పాటు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, అనారోగ్యం బారిన పడిన వారిని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువచ్చేలా ప్రతీ వార్డు పరిధిలో ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేశారు. వాటికి ప్రత్యేక స్టిక్కర్లు అంటించారు. వారి కోసం వీల్‌ చైర్లతో పాటు ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

మధ్యాహ్నం వరకు మందకొడిగానే..

ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా 11 గంటల వరకు మందకొడిగానే సాగింది. మధ్యాహ్నం 12 తర్వాత ఓటర్లు క్రమంగా కేంద్రాలకు చేరుకోవడంతో పోలింగ్‌ శాతం పెరిగింది. ప్రతీ రెండు గంటలకోసారి అధికారికంగా పోలింగ్‌ సరళి ప్రకటించారు.

ప్రభావం చూపని ‘స్వీప్‌’..

పోలింగ్‌శాతం పెంచేందుకు అధికారులు స్వీప్‌ ఆధ్వర్యంలో పట్టణంలో విస్తృత ప్రచారం కల్పించా రు. పలుకాలనీల్లో చైతన్య ర్యాలీలతోపాటు ఇంటిం టి అవగాహన చేపట్టారు. ప్రత్యేకంగా ప్రచార రథా లు ఏర్పాటు చేసి కాలనీల్లో తిప్పించారు. అయినప్పటికీ ఓటర్లపై ఆ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. ఓటర్ల సంఖ్య గతంతో పోల్చితే పెరిగినప్పటి కీ పోలింగ్‌ శాతం మాత్రం స్వల్పంగా తగ్గడం గమనార్హం. గత 2020 ఎన్నికల్లో 69.95 శాతం పోలింగ్‌ కాగా, ఈసారి 69.04 శాతానికే పరిమితమైంది.

పోలింగ్‌ శాతం నమోదు వివరాలు

పోలింగ్‌పై ఏఎస్‌డీ ప్రభావం

కై లాస్‌నగర్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో అధికారులు సిద్ధం చేసిన ఆబ్‌సెంట్‌, డెత్‌, షిఫ్టెడ్‌ (ఏఎస్‌డీ) జాబితా ప్రభావం పలు వార్డుల్లో స్పష్టంగా కనిపించింది. అనర్హులు ఓటు వేసే అవకాశం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇది ఆయా వార్డుల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ఓటర్ల వివరాలు మున్సిపల్‌ ఓటర్ల జాబితాలోనూ ఉన్నాయి. వారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాలకు వచ్చారు. అయితే అప్పటికే గ్రామాలతో పాటు పట్టణాల్లో రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారి జాబితాలను సిద్ధం చేశారు. దీంతో పోలింగ్‌ ఏజెంట్లతోపాటు అభ్యర్థులు వారిని గుర్తించి ఓటు వేయకుండా నిలువరించారు. పట్టణంలోని రవీంద్రనగర్‌తో పాటు రాంనగర్‌లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఈ పరిస్థితి కనిపించింది.

ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పెంపు

ఆదిలాబాద్‌రూరల్‌: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులు ఉచిత రెసిడెన్షియ ల్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్‌కులాల అభివృద్ధి అధికారి భగత్‌ సు నీత కుమారి ప్రకటనలో తెలిపారు. ఐదు నెల ల ఉచిత శిక్షణకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖా స్తుల గడువు ఈనెల 22 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 1న ఉదయం 11 గంటలకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో కేంద్ర, రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు సంబంధించి శిక్షణ ఉంటుందని, వివరాల కోసం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎస్సీ స్టడీ డైరెక్టర్‌ కె.రమేశ్‌ను సెల్‌: 9494149416 నంబర్‌పై సంప్రదించాలని కోరారు.

పోలింగ్‌ కేంద్రాల్లో కనిపించని రద్దీ

ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. 750 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని కేటాయించారు. ఒక్కో వార్డు పరిధిలో 3నుంచి 4 బూత్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఓటర్లు వచ్చిన వారు వచ్చినట్లుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ఒకటి రెండు కేంద్రాల్లో మాత్రమే బారులు తీరగా మెజార్టీ కేంద్రాల్లో రద్దీ కనిపించలేదు.

ఆకట్టుకున్న మోడల్‌ 1
1/5

ఆకట్టుకున్న మోడల్‌

ఆకట్టుకున్న మోడల్‌ 2
2/5

ఆకట్టుకున్న మోడల్‌

ఆకట్టుకున్న మోడల్‌ 3
3/5

ఆకట్టుకున్న మోడల్‌

ఆకట్టుకున్న మోడల్‌ 4
4/5

ఆకట్టుకున్న మోడల్‌

ఆకట్టుకున్న మోడల్‌ 5
5/5

ఆకట్టుకున్న మోడల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement