తెలంగాణలో వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రతలు.. | Cold Weather And Low Temperatures Record In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రతలు..

Nov 8 2025 9:17 AM | Updated on Nov 8 2025 10:31 AM

Cold Weather And Low Temperatures Record In Telangana

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. గురువారం రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. శుక్రవారానికి మరింతగా పడిపోయాయి. రాత్రిపూట, తెల్లవారుజామున చలిగాలుల (Cold Waves) తీవ్రత ఎక్కువైంది. మరోవైపు.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. మంచు కారణంగా తెల్లవారుజామున వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా బేలలో శుక్రవారం అతి తక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో 14.7 డిగ్రీలు, సంగారెడ్డిలోని జహీరాబాద్‌లో 14.8, శంకర్‌పల్లిలో 14.9, మొయినాబాద్‌లో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్, నిర్మల్​, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్​, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్​, రంగారెడ్డి, హైదరాబాద్​, మహబూబ్​నగర్​, నారాయణపేట, నాగర్ ​కర్నూల్​, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. అలాగే, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement