
ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని ఈ భవనంలో జైనథ్ మండలానికి చెందిన మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర వసతిగృహాన్ని నిర్వహిస్తున్నారు. పదేళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ పాఠశాలలో 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. భవనం శిథిలమై అసౌకర్యంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
భవనానికి కిటికీలు సైతం లేకపోవడంతో.. ఇటీవలి వర్షాలకు నీరు లోపలకు రాకుండా గోనె సంచులు, చద్దర్లు, అట్టముక్కలు కడుతున్నారు. వర్షాకాలం కావడంతో పురుగు, పుట్రతో భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
మక్క బుట్టలకు మస్తు గిరాకీ
నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం పచ్చి మక్క బుట్టలకు చిరునామాగా నిలిచింది. చేతికి వచ్చిన బుట్టలను డజన్ రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఆటో ట్రాలీ మక్క బుట్టల ధర రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు పలుకుతోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్, కరీంనగర్, మంచిర్యాల్, మహారాష్ట్ర, చుట్టు పక్కల ప్రాంతాల వ్యాపారులు మక్కబుట్టలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.

అంకాపూర్ మార్కెట్ శుక్రవారం పచ్చి మక్క బుట్ట విక్రయాలతో సందడిగా మారింది. సీజన్‌లో ఉదయం 5 గంటల నుంచి.. ఉదయం 9 గంటల వరకు హోల్‌సేల్ వ్యాపారం సాగుతోంది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
చదవండి: మేకల కల్యాణి.. నీకు హ్యాట్సాఫ్