17 ఏళ్లయినా చెక్కుచెదరని బాలిక మృతదేహం! | 17 Year After Burial Girls Body Found Intact In Illendu bhadradri | Sakshi
Sakshi News home page

17 ఏళ్లయినా చెక్కుచెదరని బాలిక మృతదేహం!

Mar 2 2026 10:34 AM | Updated on Mar 2 2026 12:00 PM

17 Year After Burial Girls Body Found Intact In Illendu bhadradri

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: 2009లో అనారోగ్యంతో పదేళ్ల బాలిక మృతిచెందగా ముస్లింల సంప్రదాయం ప్రకారం ఖబరస్తాన్‌లో ఖననం చేశారు. అయితే ఆ మృతదేహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న వీడియో ప్రస్తు తం వైరల్‌ అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నంబర్‌–2 బస్తీకి చెందిన అబ్దుల్‌ అజమ్‌ఖాన్‌ నాలుగు రోజుల కిందట గుండెపోటుతో మృతిచెందాడు. 

ఆయన భౌతికకాయాన్ని 17 ఏళ్ల క్రితం మృతిచెందిన తన అన్న కూతురు నస్రీన్‌ సమాధి పక్కన ఖననం చేసేందుకు గోతి తవ్వుతుండగా బాలిక మృతదేహం కనిపించింది. సహజంగా ఖననం చేసిన ఏడాదిలోపే మృతదేహం మట్టిలో కలిసిపోతుంది. కానీ 17 ఏళ్లయినా మృతదేహం అలాగే ఉండగా, పైన కప్పిన వస్త్రం రంగు మారకుండా, చెదలు పట్టకుండా ఉండటంతో అంతా షాక్‌ అయ్యారు. ఇదేదో మహిమగా భావించిన కుటుంబీకులు, మత పెద్దలు మరోమారు ప్రార్థన చేసి ఖననం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచి్చన ఈ ఘటన ఇల్లెందులో చర్చనీయాంశంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement