ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే! | Sakshi
Sakshi News home page

'మే పుష్పం' గురించి విన్నారా! ఏడాదిలో ఒకసారి మాత్రమే..

Published Wed, May 29 2024 9:08 AM

May Flower Is Special Which Blooms Only In The Month Of May Every Year

వాతావరణంలో జరిగే కాలాల మార్పుల కారణంగా అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. ప్రతీ సంవత్సరం కేవలం మే నెలలో మాత్రమే ఈ పువ్వు పూస్తుందట. మరి అదేంటో చూసేద్దామా!

ఆదిలాబాద్‌, సోన్‌ మండలంలోని న్యూవెల్మల్‌ గ్రామంలో మే పుష్పం వికసించింది. ఏటా మే నెలలో మాత్రమే పూసే ఈ పువ్వు గ్రామానికి చెందిన ఎలుగు రాజలింగం ఇంటి ఆవరణలో మంగళవారం వికసించింది. ఒకేసారి మూడు పువ్వులు పూయడం సంతోషంగా ఉందని రాజలింగం కుటుంబ సభ్యులు తెలిపారు. ఈఏడాది మొత్తం ఐదు పువ్వులు పూశాయని పేర్కొన్నారు. ఈ పూలను చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నట్లు వారు తెలిపారు.

ఇవి చదవండి: కోటి థెరపీల ఉత్సవం! ఏఎస్‌డీ..?

Advertisement
 
Advertisement
 
Advertisement