కోటి థెరపీల ఉత్సవం! ఏఎస్‌డీ..? | Sakshi
Sakshi News home page

‘ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌’ నుంచి.. ఎలా బయటపడాలి?

Published Wed, May 29 2024 8:24 AM

The Moment When The Pinnacle Company Completed Crores Of Therapies

కోటి దీపోత్సవంలో దీపాల శిఖలు మిలమిలలాడుతుంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటుంది! అలాగే చిదిమి దీపం పెట్టుకోవాల్సిన చిన్నారులు ఆటిజమ్‌తో చిన్నబోకుండా ఆ అమాయకపు ముఖాలపై చిరునవ్వుల మిలమిలలను అలాగే ఉంచడానికి పూనుకుంది ‘పినాకిల్‌’ సంస్థ. లక్షణాల్ని బట్టి ఒక్కో ఆటిజమ్‌ చిన్నారికి ఒక్కో థెరపీ అవసరమవుతుంది. అలాంటి ‘కోటి థెరపీ’లను పూర్తి చేసింది ఈ సంస్థ,

‘ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌’ (ఏఎస్‌డీ) అని పిలిచే ఈ రుగ్మత ఉన్న పిల్లలకు జ్ఞానేంద్రియాల నుంచి మెదడుకు సమాచారం చేరడమూ... అక్కణ్ణుంచి తాము స్పందించాల్సిన రీతిలో స్పందించక΄ోవడమనే సమస్య ఉంటుంది. సెన్సెస్‌(జ్ఞానేంద్రియాల)కు సంబంధించిన సమస్య కాబట్టి దీన్ని ‘సెన్సోరియల్‌ సమస్య’గా చెబుతారు. ఆ పిల్లలు తమదైన ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంటారు. కళ్లలో కళ్లు కలిపి చూడలేరు. స్పీచ్‌ ప్రాబ్లమ్స్‌ ఉంటాయి. ఉదాహరణకు నేర్చుకున్న ఒకే పదాన్ని పదే పదే అదే ఉచ్చరిస్తూ ఉంటారు. తోటి పిల్లలతో కలవడానికీ, ఆడుకోడానికి పెద్దగా ఆసక్తి చూపరు.

అలాంటి పిల్లలకు అవసరమైన చికిత్స (థెరపీలు) అందిస్తోంది పినాకిల్‌ సంస్థ. లోపాల్ని చక్కదిద్దడానికి అవసరాన్ని బట్టి స్పీచ్‌ థెరపీ, బిహేవియర్‌ థెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, డాన్స్‌ థెరపీ... ఇలాంటి అనేక థెరపీలు అందిస్తోంది. లక్షణాలూ, తీవ్రతలను బట్టి ఒక్కో చిన్నారికి నాలుగైదేసి థెరపీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి కోటి థెరపీలను ఇటీవలే పూర్తి చేసిందీ సంస్థ. తాము ఈ అసిధారా క్రతువు చేపట్టడం వెనక ఓ నేపథ్యముందంటున్నారు ‘పినాకిల్‌’ వ్యవస్థాపకురాలు శ్రీజారెడ్డి సరిపల్లి.

తొలిచూలు పంటగా పుట్టిన పిల్లాడు మొదట్లో అంతా బాగున్నట్టే కనిపించినా... ఏడాదిన్నర గడిచాక కూడా మాటలు రాక΄ోవడం చూసి ఆందోళన పడ్డారు కోటిరెడ్డి, శ్రీజారెడ్డి దంపతులు. డాక్టర్‌కు చూపిస్తే వినలేక΄ోతున్నాడనీ, బహుశా ఆటిజమ్‌ కావచ్చని చెప్పారు. చికిత్స కోసం అనేకచోట్ల తిరిగారు. పరిష్కారం దొరకలేదు. వ్యాధి నిర్థారణ సరిగ్గా జరగలేదు.

- శ్రీజా రెడ్డి సరిపల్లి

పదిహేను రోజులకు అసలు విషయం తెలిసింది. ఆటిజమ్‌ కాదు, చెవి సమస్య అని తేలింది. అందుకు అవసరమైన శస్త్రచికిత్సలను రెండు చెవులకూ ఒకేసారి చేయించారు. పరిస్థితి పరిష్కారమైందనుకున్నారు. కానీ కేవలం శస్త్రచికిత్స సరి΄ోదు, స్పీచ్‌ థెరపీ కూడా అవసరమని వైద్యులు చెప్పారు.

అన్నీ ఉండి కూడా తమలాంటివారికే ఇంత కష్టంగా ఉంటే, ఏమీ తెలియని వారికి ఇంకెంత కష్టం ఉంటుందన్న ఆలోచన వారిలో రేకెత్తింది. ఆ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న సంస్థే ‘పినాకిల్‌’. ఆ ఆటిజమ్‌ సమస్యను ఎదుర్కొనే పిల్లల తల్లిదండ్రుల దుఃఖం తీర్చడానికీ, ఆ పిల్లలు తమ పనులు తామే చేసుకునేలా, దాదాపుగా మిగతా పిల్లల్లాగే ఆడుకునేలా, నడచుకునేలా చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ అది!

‘‘పినాకిల్‌ సంస్థకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 70కి పైగా సేవాకేంద్రాలున్నాయి. ఆటిజమ్‌ పిల్లలకు అవసరమైన రకరకాల థెరపీలను అక్కడ అందిస్తుంటారు. లోపల జరుగుతున్న చికిత్సను తల్లిదండ్రులు బయట ఉండి స్క్రీన్‌ మీద చూడవచ్చు. కేవలం భారత్‌లోనే కాదు... యూఎస్‌ఏ, సింగపూర్, దుబాయ్‌లలోనూ ఈ సేవలున్నాయి. త్వరలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిటేర్స్‌లోనూ పినాకిల్‌ సేవలు అందనున్నాయి. ఖర్చు భరించలేనివారికి ‘సేవా’ విభాగం కింద వారు తాము చెల్లించగలిగేంత లేదా కేవలం ఒక్క రూపాయి చెల్లించి సేవలు ΄÷ందవచ్చు. పద్ధెనిమిది భాషల్లో మా హెల్ప్‌లైన్‌ పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా భాషల్లో సమాచారం తెలుసుకునేలా మా ‘థెరపాటిక్‌ ఏఐ’ రూ΄÷ందుతోంది. మా హెల్ప్‌లైన్‌ 9100 181 181 కు ఏ టైమ్‌లో ఫోన్‌ చేసినా ఆటిజమ్‌ పిల్లల తల్లిదండ్రులకుప్రాథమిక సమాచారం ఎల్లవేళలా అందుతుంది.

ఏఐ ఎందుకంటే..?
ఇలాంటి ఓ రుగ్మత ఉందని కనుగొన్న నాటినుంచి నేటికి దాదాపు 133 ఏళ్లు. ఇంతటి చరిత్రా, వేర్వేరు థెరపీల నేర్పూ, నైపుణ్యాలు ఒక్కోచోట ఒక్కొక్కరిలో ఇలా పరిమితంగానే దొరుకుతుండవచ్చు. ఆ అంతటినీ సమగ్రంగా సమీకరించడం, ఒక్కచోటే అందేలా క్రోడీకరించడం అవసరం. అది ‘ఏఐ’తోనే సాధ్యం. అందుకే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయం తీసుకుంటున్నాం.’’ అంటూ తమ సేవల గురించి వివరించారు పినాకిల్‌ సంస్థ ఫౌండర్, చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ శ్రీజా సరిపల్లి. సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

ఇవి చదవండి: చక్కని ‘ఫాంగ్‌’కు చాంగు భళా.. ఇదే!

Advertisement
 
Advertisement
 
Advertisement