
ఆదిలాబాద్‌టౌన్: చెల్లి ప్రేమ వివాహం చేసుకోవడాన్ని ఓర్వలేక ఓ అక్క ఆమెను కిడ్నాప్ చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. గురువారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. చెల్లె భగత్ మనీషా ప్రేమ వివాహం చేసుకోగా, తనకు పెళ్లి కాలేదని తలమడుగుకు చెందిన విజయ ఆమైపె కక్ష పెంచుకుంది. ఆమె భర్త నుంచి విడదీసేందుకు పన్నాగం పన్నింది. ఆమెను మహారాష్ట్రలోని కిన్వట్‌లో బంధించింది.
బాధితురాలి భర్త అలుగంటి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌నకు సహకరించిన తలమడుగుకు చెందిన భగత్ విజయ, భగత్ సునంద, భగత్ ప్రగతి, తాంసికి చెందిన షబ్బీర్, ఓ మైనర్ బాలుడితో పాటు కిన్వట్‌కు చెందిన ప్రతీన్‌పై కేసు నమోదు చేశారు.
కిడ్నాప్‌కు గురైన బాధితురాలి ఆచూకీ తెలుసుకుని ఆమెను కిన్వట్ నుంచి తీసుకువచ్చారు. కాగా, మనీషా ఇటీవల భగత్ శ్రీనివాస్‌తో ప్రేమ వివాహం చేసుకుని ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్‌నగర్‌లో నివాసముంటోంది. ఈ పెళ్లి ఇష్టం లేకనే ఆమె అక్క కిడ్నాప్‌నకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. సోషల్ మీడియాలో పోలీసులపై దుష్ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థ మహిళలపై గౌరవంగా వ్యవహరిస్తుందని తెలిపారు. టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ ఉన్నారు.