ఆసిఫాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చలికి వణుకుతోంది. ఈ సీజన్‌లో గురువారం అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 5.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.
ఇదే జిల్లాలోని కెరమెరిలో 5.7, తిర్యాణిలో 5.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి– టి గ్రామంలో 6.1, బోథ్ మండలం పొచ్చరలో 6.4, భోరజ్ మండల కేంద్రంలో 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో తీవ్రంగా చలిగాలులు వీస్తున్నాయి.


