మునిపల్లి (అందోల్): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌లోని వోక్సన్ యూనివర్సిటీ క్రీడాకారులతో సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ ఆడారు. గురువారం రాత్రి యూనివర్సిటీ క్రీడాకారులతో రెండు బ్యాచ్‌లతో ఆడారు.
అంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. వర్సిటీ లోకి 6.32 గంటలకు వచ్చిన సీఎం రాత్రి 8.15 గంటలకు వెళ్లిపోయారు. రేవంత్‌కు వర్సి టీ యాజమాన్యం జ్ఞాపికను అందజేసింది.


