నాణేలను పరిశీలిస్తున్న భట్టివిక్రమార్క
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
న్యూమిస్ మ్యాటిక్స్ సొసైటీ సెమినార్‌లో ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: వారసత్వ అధ్యయనాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్ర మార్క అన్నారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్ ఆర్‌డీ)లో జరిగిన ‘దక్షిణ భారతదేశ నాణేలు మరియు ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై న్యూ మిస్ మ్యాటిక్స్ సొసైటీ ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. వారసత్వ ఆధారిత పరిశోధనకు తెలంగాణ ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు.
పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో మన రాష్ట్రాన్ని శాస్త్రీయ అధ్యయనం, సంస్కృతి సంరక్షణ హబ్‌గా తీర్చిదిద్ద డంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందన్నారు. దక్షిణ భారతదేశానికి అత్యంత సమృద్ధిగా నాణేల పరంపర ఉందని, శాతవాహనులు, ఇక్ష్వాకులు తమ వాణిజ్య నెట్‌వర్క్‌లను నాణేల ద్వారా విస్తరించగా, కాకతీయుల నుంచి విజయన గర సామ్రాజ్యపు వైభవం వరకు మన ప్రాంతపు నాణేలు ఆవిష్కరణ, కళాత్మకత, రాజ్యపాలనకు ప్ర తీకగా నిలిచాయని చెప్పారు.
ఈ సదస్సు స్వతహా గానే చరిత్రాత్మకమైనదని, వారసత్వ శాఖ ఇంతకు ముందు పురావస్తు, మ్యూజి యంల శాఖ 114 ఏళ్ల ప్రయాణంలో తొలిసారిగా నాణేలపై మాత్రమే జాతీయ సదస్సును నిర్వహించడం అభినందనీయ మన్నారు. ఈ సదస్సు రెండురోజులు జరిగే కార్యక్ర మంగా మాత్రమే కాకుండా, కొత్త ఆలోచనలను రగిలించే వేదిక కావాలన్నారు. న్యూ మిస్ మ్యా టిక్స్, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ ముందంజలో నిలవాలని భట్టి ఆకాంక్షించారు.


