
ఆదిలాబాద్: కొత్తగా రేషన్‌కార్డులు పొందిన వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే నెలలో వారికి సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. కార్డుదారుల సంఖ్యకనుగుణంగా అవసరమైన కోటా కేటాయించింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే పంపిణీలో వీరంతా లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది.
సెప్టెంబర్ కోటా పంపిణీకి ఏర్పాట్లు..
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తోంది. వర్షాకాలం నేపథ్యంలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను గత జూన్‌లో ఒకేసారి పంపిణీ చేసింది. ప్రస్తుతం ఆ గడువు ముగియడంతో సెప్టెంబర్ కోటా పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్ షాపులకు సంబంధించిన డైనమిక్ కీ రిజిస్ట్రార్ (డీకేఆర్) స్పష్టం కావడంతో జిల్లాకు అవసరమైన బియ్యం కోటా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా కోటా సరఫరాకు గాను నిజామాబాద్ జిల్లాను కేటాయించింది. జిల్లాలోని ఐదు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు బియ్యం చేరనున్నాయి. మంగళవారం నుంచి సరఫరా ప్రారంభమయ్యే అవకాశమున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి వాటి పరిధిలోని చౌక ధరల దుకాణాలకు చేరవేయనున్నారు.
పెరిగిన కార్డులు.. బియ్యం కోటా
పదేళ్ల నిరీక్షణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ చేపట్టింది. అలాగే కొత్త స భ్యులను చేర్చేందుకు సైతం అవకాశం కల్పించింది. జిల్లాలో కొత్తగా 21,670 కార్డులు మంజూరయ్యా యి. వాటి పరిధిలో కార్డుదారులతో పాటు సభ్యులకు సంబంధించి 45,289 మంది చేరారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,92,757 రేషన్‌కార్డులు ఉండగా వీటి పరిధిలో 6,61,103 మంది సభ్యులు న్నారు. తాజాగా జారీ చేసిన కార్డులతో ఈ సంఖ్య 2,14,427కు పెరిగింది. అలాగే యూనిట్ల సంఖ్య 11,14,002కు చేరింది. కార్డుల సంఖ్యతో పాటు బి య్యం కోటా కూడా పెరిగింది. ఇప్పటి వర కు ప్రతీ నెలా 4,180 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిస్తుండగా పెరిగిన కార్డుల సంఖ్యకనుగుణంగా ఈ నెలకు 4,480 మెట్రిక్ టన్నులు కేటాయించారు. నూతన కార్డుదారులందరికీ సెప్టెంబర్ కోటా కింద 1వ తేదీ నుంచి బియ్యం అందజేయనున్నారు.
బియ్యంతోపాటు సంచి కూడా ఫ్రీ
కార్డుదారులకు ఉచితంగా బియ్యంతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పర్యావరణహితమైన సంచులను సైతం అందించాలని నిర్ణయించింది. వైట్‌కలర్‌లో ఉన్న ఈ బ్యాగుపైన సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఫొటోలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తం ఆరు గ్యారెంటీల ప థకాల వివరాలు ముద్రించారు. రూ.50విలువ చేసే ఈ సంచిని బియ్యంతో పాటు ఉచితంగా అందజేయనున్నారు.ఈ బ్యాగులు సైతం జిల్లాకు చేరాయి.
బియ్యం కోటా పెరిగింది
జిల్లాలో కొత్తగా జారీ చేసిన కార్డులకు అనుగుణంగా ప్రభుత్వం బియ్యం కోటా విడుదల చేసింది. జిల్లాకు అవసరమైన సన్నబియ్యంను నిజామాబాద్ నుంచి సరఫరా చేయనుంది. సోమవారం నుంచి జిల్లాకు వచ్చే అవకాశముంది. ఎంఎల్‌ఎస్ పాయింట్లకు చేరాక అక్కడి నుంచి షాపుల వారీగా సరఫరా చేసి సెప్టెంబర్ ఒకటి నుంచి కార్డుదారులందరికీ అందజేస్తాం.
– వాజీద్‌అలీ, డీసీఎస్‌వో