దర్శకధీరుడు రాజమౌళి గ్లోబల్ రేంజ్‌లో ఈవెంట్‌ను నిర్వహించారు. తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళిని మించినవారు ఎవరూ ఉండరు. అత్యంత భారీ బడ్జెట్‌తో తీయడమే కాదు.. ఆ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడంలో మన దర్శకధీరుడే దిట్ట అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్న ఆయన టైటిల్ రివీల్ కోసం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేశారు.
కానీ ఈ వేదికపై రాజమౌళి చేసిన కామెంట్స్‌తో చిక్కుల్లో పడ్డారు. తాను దేవుళ్లను నమ్మనంటూ ఆయన చేసిన కామెంట్స్ హిందువుల మనోభావాలు దెబ్బతీశాయి. దీంతో రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. రాజమౌళి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక సంగతి అటుంచితే ఇప్పుడు ఈ మూవీ టైటిల్‌పై మరో వివాదం నెలకొంది. వారణాసి అనే టైటిల్ పేరును రాజమౌళి గ్లింప్స్ రిలీజ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా మూవీ టైటిల్‌పైనే వివాదం మొదలైంది. ఇప్పటికే హనుమంతునిపై వ్యాఖ్యలతో గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌పై విమర్శలు వస్తుండగా.. ఇప్పుడు అది కాస్తా వారణాసి టైటిల్‌వైపు మళ్లింది. ఈ మూవీ టైటిల్ తాము ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నామంటూ రామ భక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్ ఫిర్యాదు చేసింది. ఫిల్మ్ ఛాంబర్‌లో తన కంప్లైంట్‌ను సమర్పించింది. ఒకవైపు తన కామెంట్స్‌తో వివాదం ఎదుర్కొంటున్న రాజమౌళికి టైటిల్ రూపంలో మరోసారి చిక్కుల్లోపడ్డారు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.


