బాలకృష్ణ- బోయపాటి శ్రీను సినిమా 'అఖండ2: తాండవం'.. డిసెంబర్ 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. సంక్రాంతి కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు యాప్‌లో పేర్కొంది. అప్‌కమింగ్ చిత్రాల జాబితాలో కూడా పోస్టర్‌తో పేర్కొంది. దీంతో ఈ పండుగనాడు సినిమాను మరోసారి చూడొచ్చని బాలయ్య ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే, తాజాగా నెట్‌ఫ్లిక్స్ ట్విస్ట్ ఇచ్చింది.
'అఖండ2: తాండవం' నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 9న స్ట్రీమింగ్‌కు వస్తుందని యాప్‌లో ప్రకటించారు. ఈ క్రమంలోనే సినిమా పోస్టర్‌ను కూడా ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ (యాప్) అప్‌కమింగ్ చిత్రాల విభాగంలో కనిపించింది. కానీ, ఇప్పుడు దానిని తొలగించారు. మూవీ లింక్‌ను కూడా తప్పించారు. అయితే, సోషల్‌మీడియాలో మాత్రం ఇప్పటివరకు అఖండ-2 స్ట్రీమింగ్ వివరాలను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించలేదు. త్వరలో అధికారికంగా మరో కొత్త తేదీని ఎంపిక చేసుకుని వివరాలు తెలిపే ఛాన్స్ ఉంది.
'అఖండ 2' నిర్మాతలకు భారీనష్టాలే తెచ్చిపెట్టిందని బాక్సాఫీస్ లెక్కలు తెలుపుతున్నాయి. 2025లో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ మూవీ కోసం సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌ను 14 రీల్స్ ప్లస్ సంస్థ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 93 కోట్ల నెట్ రాబట్టినట్లు ప్రముఖ వెబ్‌సైట్ సాక్నిల్ తెలిపింది. అంటే ఏకంగా రూ. 100 కోట్ల మేరకు నష్టాలను నిర్మాతలకు మిగిల్చినట్లు తేలుతుంది.


