రామ్ చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన కొణిదెల చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెనుదూమరం రేపుతున్నాయి. రోజురోజుకి ఆ వ్యాఖ్యలపై చర్చ తారస్థాయికి చేరిపోతోంది. సర్వత్రా తీవ్రస్థాయిలో ఆమె మాటల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె మహిళలు కూడా తమ కెరీర్‌లో దూసుకుపోవాలి, అదే ప్రగతి శీల అన్న కోణంలో చేసిన వ్యాఖ్యలు..నిపుణులు, వైద్యులను కలవరపరిచాయి. ఆమె యువతకు ఇచ్చిన సందేశం..అవాస్తవం, హానికరం అంటూ ఫైర్ అవుతున్నారు. మొన్న దీనిపై జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ..యుంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఇచ్చిన సందేశం చూశాం. అది మరువక మునుపే తాజాగా వైద్య నిపుణులు, ఐఐటీ-ఐఐఎం గ్రాడ్యుయేట్లు సైతం ఉపాసన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇంతకీ నిపుణులు, గ్రాడ్యుయేట్లు ఏం అంటున్నారంటే..
ఢిల్లీ ఎయిమ్స్ వైద్యురాలు దత్తా వివాహం ఆశయానికి అడ్డంకి కాదని నొక్కి చెప్పారు. అన్ని విధాల మద్దతు ఇచ్చే భాగస్వామి ఉంటే..కెరీర్, పిల్లలు రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చని, అదేమంతా కష్టం కాదని అన్నారామె. ఉపాసన వ్యాఖ్యలు యువతను పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉందని ఫైర్ అయ్యారు. యుక్త వయసుని వృధా చేసుకునే ప్రమాదం లేకపోలేదని అన్నారు.
అంతేగాదు తగిన వయసులో పెళ్లి చేసుకుంటే..పేరెంట్స్‌గా మారేందుకు, అలాగే తాతమామలకు కూడా సంతోషాన్ని అందిస్తుందని అన్నారు. తమ మనవళ్లు లేదా మనవడితో స్పెండ్ చేసే సమయం వారికి దొరుకుతుందని అన్నారు. అంతేగాదు ఉపాసన చిన్న వయసులో పెళ్లిచేసుకుందని, తర్వాత కెరీర్‌ని నిర్మించుకుందని అన్నారు. అందువల్ల ఆమె చెప్పిన సందేశం..సగటు యువతికి అత్యంత భినమైనదని అన్నారు. అయిన ధనవంతుల ఆలోచనలను ఎవ్వరూ గుడ్డిగా నమ్మోద్దని అన్నారు.
అసలు మహిళలను సంపాదనకు ప్రాధాన్యత ఇవ్వమని, వివాహం, మాృతత్వం వంటి వాటిని వాయిదా వేయమని సూచించకూడదు. కెరీర్‌లో బాగా సెటిల్ అవ్వడం..అంటే ఓపక్క వయసు దాటిపోయాక పిల్లలు కనాలనుకోడం కాదని, అలా చేస్తే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. అలాగే ఎగ్స్‌ను ఫ్రీజ్ చేసుకున్నంత మాత్రన కచ్చితంగా బిడ్డలు పుట్టేస్తారన్న గ్యారంటీ లేదని చాలా మంది వైద్యలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతేగాదు ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లు, పలువురు వైద్యులు ఉపాసన వ్యాఖ్యలు తప్పుడు సందేశాన్ని ఇస్తున్నాయని, ఇవి యువతకు ప్రమాదకరం అంటూ మండిపడ్డారు. మరికొందరు నిపుణులు నిజానికి వివాహం, కెరీర్ రెండిటిని డిఫరెంట్ ఛాయిస్‌లుగా చూడోద్దని సూచించారు.
ఇది భార్యభర్తల బలోపేతమైన భాగస్వామ్యంతో ముడిపడి ఉన్న అంశమని, ఆ విషయాన్ని ఉపాసన తెలుసుకోలేకపోయిందంటూ విమర్శించారు. ఇక ఉపాసన సైతం ఈ పోస్ట్‌లపై స్పందించారు. సరైన భాగస్వామి దొరికే వరకు వేచి చూడటం, పిల్లలను ఎప్పుడు కనాలి అనేదానిపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం ఎలా తప్పువుతుందని ప్రశ్నించారామె.
I too advise people to marry early—not out of duty or anything like that.
Having kids early makes life easier and gives your parents as much time as possible to enjoy their grandchildren. https://t.co/Cjmead5UhA— Deepan Shanmugasundaram (@deepan_civileng) November 19, 2025
తన ఉద్దేశ్యం మరింతమంది మహిళలను శ్రామికశక్తిలోకి తీసుకురావాలని యజమానులకు పిలుపునిచ్చానే తప్ప ఇందులో ఎలాంటి అనుచిత సందేశం లేదని వివరణ ఇచ్చింది. అలాగే తన వ్యక్తిగత కారణాల వల్లే 29 ఏళ్ల వయసులో తన ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకున్నట్లు వివరించింది. తాను కేవలం వివాహానికి ముందు కెరీర్‌పై మహిళలు దృష్టిపెట్టి..ఆర్థిక స్వేచ్ఛ పొందాలనేది తన అభిప్రాయమని నర్మగర్భంగా చెప్పారామె. ఏదిఏమైన ఉపాసన వ్యాఖ్యలు సదుద్దేశ్యంతో చేసినప్పటికీ..అటు వైద్యనిపుణులు, ఇటు ఐఐటీ గ్రాడ్యుయేట్లు నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవ్వడం గమనార్హం.
(చదవండి: పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్)


