ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా | Genelia D’Souza Opens Up About Her Journey From Non Vegetarian To Vegan And The Reasons Behind Her Lifestyle Change | Sakshi
Sakshi News home page

ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా

Jan 4 2026 12:26 PM | Updated on Jan 4 2026 12:59 PM

Genelia DSouza Reveals Why She Turned Vegan

ఇటీవల కాలంలో వేగనిజం అత్యంత ప్రజాదరణ పొందుతోంది. చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు వేగన్‌గా మారుతున్నారు. తాజాగా టాలీవుడ్‌ నటి, ప్రముఖ బాలీవుడ్‌ హీరో భార్య జెనీలియి డిసౌజా కూడా పూర్తిగా శాకాహారిగా మారినట్లు వెల్లడించారు. అయితే తాను మొదట్లో పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకునేదాన్ని కాదని, తర్వాత పూర్తిగా వేగన్‌గా మారిపోయానని అన్నారు. ఎందువల్ల ఈ మార్పు, దానికి గల కారణాలను కూడా ఆమె షేర్‌ చేసుకున్నారు. 

చాలామంది ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మొక్కల ఆధారిత ఆహారం తీసుకుంటున్నారు. అలాంటి వారి జాబితాలోకి తాజాగా జెనీలియా డిసౌజా కూడా  చేరారు. ఆమె 2020 నుంచి వేగన్‌గా మారారట. సోహా అలీఖాన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో జరిగిన సంభాషణలో జెనీలియా తాను 2017లో మాంసాహారం నుంచి పూర్తిగా శాకాహారానికి మారినట్లు చెప్పారు. తాను 2017 నుంచి మాంసం తినడం మానేసినట్లు తెలిపింది. 

అయితే పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకునేదాన్ని కాదని, కొద్దిగా పాల ఉత్పత్తులు, చీజ్, గుడ్లు వంటివి తీసుకునేదాన్ని అని అన్నారు. చాలామంది కూరగాయలు తినడం మొదలు పెడితే ఆధ్యాత్మిక స్థితికి చేరుకుంటారని తరుచుగా చాలామంది చెబుతుండే వారు. తనకు కూడా అలాంటి అనుభూతే కలిగిందని అంటోంది జెనీలియా. ఆరోగ్యానికి మంచిదన్న ఉద్దేశ్యంతోనే ఈ రకమైన జీవనశైలిని అవలంభించానని అన్నారామె. 

తాను మాంసం తినే కుటుంబంలో జన్మించానని, తనకు పెద్దగా శాకాహారం అంటే ఏంటో తెలియదని అన్నారు. తాను బఠానీలు, బంగాళదుంపలు, పనీర్‌ మాత్రమే శాకాహారం అనుకునేదాన్ని, ఆ తర్వాత తెలిసింది అంతకుమంచి మంచి ప్రోటీన్‌ మాంసకృత్తులు ఉన్నా ఆహారాలు శాకాహారంలో కూడా ఉన్నాయని. అయితే తాను జంతు ప్రేమికురాలినే అయినప్పటికీ..అప్పుడు మాత్రం మాంసాన్ని ఇష్టంగా ఆస్వాదించేదాన్ని అని చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడైతే మాంసాహారాన్ని పరిమితం చేయడం మొదలు పెడతామో..అప్పుడు..ప్రతిది హాయిగా ఆస్వాదించగలుగుతాం, చాలా తేలికగా కూడా ఉంటుందన్నారామె. 

ఎలా మొదలైందంటే..
మహమ్మారి సమయంలో 2020లో తాను పూర్తిగా వేగన్‌గా మారానని జెనీలియా పేర్కొన్నారు. తన భర్త రితేష్‌ కారణంగా ఇదంతా జరిగిందన్నారు. 2016లో ఆయన మాంసం తింటుంటే ఏదో బాగోలేని అనుభూతి కలుగుతోందని మానేశారు..అయితే అప్పటికీ తాను మాంసహారిగానే ఉన్నానని గుర్తుచేసుకున్నారు. అలా జనవరి 1, 2017న తాము దీన్ని పూర్తిగా మానేయాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. 

అయితే అప్పటికీ తాము గుడ్లు, పాల ఉత్పత్తులు తీసుకునేవాళ్లం. కరోనా మహమ్మారి సమయం ప్రతిఒక్కరూ బిక్కుబిక్కుమంటున్న టైంలో రితేష్‌ ఎందుకు జంతు ఉత్పత్తులను కూడా మానేయకూడదు అని అడిగారు. దాంతో తాను సరే ఈ మార్పు ప్రయత్నించి చూద్దాం అన్నాను. రాను రాను అది అద్భుతంగా అనిపించడం ప్రారంభించింది, మా రోటీలో కొద్దిగా పాలు, లేదా వెన్న తినిన ప్రతిసారి కడుపు నిండిన అనుభూతి కలిగింది. 

ఇలా మారడం అంత ఈజీ కాదు, అలానే పూర్తిస్థాయిలో శాకాహారిగా మారలేరు కూడా. రోజులు గడుస్తున్న కొద్దిపూర్తిగా వేగన్‌గా మారడం ఎలా అనేది అవగతమవుతుంటుందని, ఇంకా ఇప్పటికీ తాను నేర్చుకుంటూనే ఉన్నానని చెప్పుకొచ్చారు జెనీలియా. 

పూర్తి శాకాహారంతో ఆరోగ్యంగా ఉండగలమా..?
శాకాహారులుగా ఉన్న చాలామంది పోషకాహార లోపాలు ఎదుర్కొంటున్నారు కదా, మరి అలాంటప్పుడూ ఇది ఏవిధంగా ఆరోగ్యానికి మంచిది అనేది అందరిలోనూ ఎదురయ్యే సందేహం. అయితే పోషకాహార నిపుణులు ప్రాథమికంగా ఏ ఆహారమైన తీసుకునే విధానం బట్టే అన్ని ప్రోటీన్లు పుష్కలంగా తీసుకోవడం సాధ్యమవుతుందంటున్నారు. 

మాంసం తినేవారికి సైతం బీ12 లోపం ఉంటుందనేది గుర్తెరగాలి. అందువల్ల ఇలా శాకాహారిగా మారాలనుకునే వాళ్లు..అన్ని విటమిన్లు, ప్రోటీన్లు అందేలా సవ్వంగా మార్పులు చేసుకోవాలి. అలాగే మొక్కల ఆధారిత ఆహారాలు మన శరీరానికి అన్నింటిని అందించలేకపోవచ్చు గానీ..ఆ లోపాన్ని ఆయా సప్లిమెంట్స్‌తో ఈజీగా భర్తీ చేసుకోవచ్చని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. 

(చదవండి: ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ రేంజ్‌కి..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement