త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'.. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు.
మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ప్రేక్షకులను మెప్పించేలా టీజర్ ఉంది. ముఖ్యంగా ప్రకాష్ చెరుకూరి అందించిన సంగీతం మరింత ఇంపాక్ట్ చూపుతుంది.


