అలాంటి వారిపై కఠిన చర్యలు: సజ్జనార్‌ హెచ్చరిక | CP VC Sajjanar Serious Suggestions To Netizens | Sakshi
Sakshi News home page

అలాంటి వారిపై కఠిన చర్యలు: సజ్జనార్‌ హెచ్చరిక

Nov 20 2025 11:18 AM | Updated on Nov 20 2025 11:34 AM

CP VC Sajjanar Serious Suggestions To Netizens

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేసినా, విధులకు ఆటంకం కలిగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. ఒక్క‌సారి కేసు న‌మోదైతే భ‌విష్య‌త్ అంధ‌కార‌మ‌య్యే ప్రమాదం ఉంటుందన్నారు.

హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా..‘పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన, బెదిరింపులకు దిగినా, దాడులు చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్ ప్ర‌కారం బాధ్యుల‌పై క్రిమినల్ కేసులను నమోదు చేస్తాం. హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం.

గుర్తుంచుకోండి.. ఒక్క‌సారి కేసు న‌మోదైతే భ‌విష్య‌త్ అంధ‌కార‌మ‌య్యే ప్రమాదం ఉంటుంది. పాస్ పోర్టు జారీకి, ప్ర‌భుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వ‌స్తాయి. క్ష‌ణికావేశంలో ఏ చిన్న‌త‌ప్పు చేసిన జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాయి’ అని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement