పాలమూరు: అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రెండేళ్లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ధ్వజమెత్తారు కేటీఆర్. ఈరోజు( సోమవారం, జనవరి 12వ తేదీ) మహబూబ్‌నగర్ జిల్లాల పాలమూరులో పర్యటించిన కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ఏ వర్గానికీ న్యాయం చేయలేదన్నారు.
‘రెండేళ్లలో ఏ వర్గానికి ప్రభుత్వం న్యాయం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయాయి. మూటలు కట్టి డబ్బులను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. మనం సబ్జెక్ట్ మాట్లాడితే.. రేవంత్ బూతులు మాట్లాడుతున్నారు. సంస్కారం అడ్డొస్తుందని మేం తిట్టడం లేదు. అడ్డిమారి గుడ్డిదెబ్బలో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు’ అని ఆరోపించారు.


