జాతి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందంటూ జమ్మూ -కాశ్మీర్ పోలీసులకు చెందిన రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) గురువారం జమ్మూలోని కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై దాడి చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలతో ఈ దాడులు చేపట్టింది.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ప్రారంభమైన సోదాలలో Ak-47 కార్ట్రిడ్జ్‌లు, పిస్టల్ రౌండ్లు , మూడు గ్రెనేడ్ లివర్‌లు స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అసంతృప్తిని వ్యాప్తి చేయడం, వేర్పాటువాదాన్ని కీర్తించడం లాంటివి, భారతదేశం, కేంద్రపాలిత ప్రాంతం, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంకరమనే ఆరోపణల కింద కాశ్మీర్ టైమ్స్‌పై కేసు నమోదు చేశారు. కాశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉందని ఎన్‌డీటీవీ రిపోర్ట్ చేసింది.
ఇదీ చదవండి: Delhi Blast Case : మరో నలుగురు ప్రధాన నిందితులు అరెస్ట్
మరోవైపు మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఆరోపణలను కాశ్మీర్ టైమ్స్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులకు సంబంధించిన తమకు అధికారికర సమాచారమేదీ లేదని ఒక ప్రకటనలో తెలిపింది.. రాష్ట్రానికి హానికలిగించే కార్యకలాపాలు అంటూ ఎస్‌ఐఏ చేసిన ఆరోపణలని నిరాధారమైనవని పేర్కొంది. తమ కార్యాలయంపై దాడి తమ వాయిస్‌ను అణచివేసేందుకు చేసే మరో ప్రయత్నంలో భాగమేనని ఆరోపించింది. తమ కార్యాలయం గత నాలుగు సంవత్సరాలుగా మూసివేశామని, ప్రింట్ ఎడిషన్ 2021-2022లో నిలిపివేయగా, డిజిటల్‌గా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నామని వివరించింది. రాష్ట్రానికి తమ కార్యాలయాలపై దాడి చేసే అధికారం ఉండవచ్చు. కానీ నిజాలను మాట్లాడే తమ నిబద్ధతపై దాడి చేయదని పేర్కొంది. జర్నలిజం నేరం కాదు. జవాబుదారీతనం రాజద్రోహం కాదు. తాము తమపై ఆధారపడిన వారికి సమాచారం ఇవ్వడం కొనసాగిస్తామనం ఎడిటర్లుప్రబోధ్ జమ్వాల్, అనురాధ భాసిన్ ప్రకటించారు.


