గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌ | IDF Airstrikes across Gaza | Sakshi
Sakshi News home page

గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌

Nov 20 2025 8:19 AM | Updated on Nov 20 2025 8:19 AM

IDF Airstrikes across Gaza

జెరూసలేం: పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాజాను టార్గెట్‌ చేసి ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌ ఐడీఎఫ్‌ దాడుల్లో 34 మంది చనిపోయినట్టు గాజా డిఫెన్స్‌ ఏజెన్సీ వెల్లడించింది. దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళం గాజాను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగింది. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలో 12 మంది, ఖాన్‌ యూనిస్ ప్రాంతంలో 10 మంది మృతి చెందినట్లు హమాస్ వెల్లడించింది. ఈ మేరకు గాజా డిఫెన్స్‌ ఏజెన్సీ వివరాలను వెల్లడించింది. అయితే, ఇజ్రాయెల్ మిలిటరీ వాదన మాత్రం మరోలా ఉంది. హమాస్‌ ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే తాము దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది. కాగా, ఈ కాల్పులు దాదాపు ఆరు వారాలుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి.

మరోవైపు.. దక్షిణ లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్థి శిబిరం సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా, నలుగురు గాయపడినట్లు లెబనాన్ ప్రకటించింది. ఐన్ ఎల్-హిల్వే ప్రాంతంలో ఆయుధాలతో ఉన్న హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే అక్కడ ఎలాంటి సాయుధ బలగాలు లేవని లెబనాన్ పేర్కొంది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతి పెద్ద దాడిగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. అక్టోబర్ 10 నుండి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఐడీఎఫ్ దళాలు గాజాలో సగానికి పైగా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మిగిలిన ప్రాంతం వాస్తవ హమాస్ నియంత్రణలో ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement