వీలైతే యుద్ధం.. లేకపోతే శాంతి మంత్రం.. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో గత కొంతకాలంగా చూస్తూ వస్తున్న యాంగిల్స్. అయితే ఆయనలో ‘బిజినెస్‌మ్యాన్’ కూడా ఉన్నాడండి. తాను అనుకున్న దానిని ఏదో రకంగా దక్కించుకోవడమే ఈ బిజినెస్ సూత్రం. వీలేతై దేన్నైనా కొనేయడం. మనం షేర్లు కొన్నట్లు డెన్మార్క్‌లో భాగమైన గ్రీన్‌లాండ్‌ను కొనేయడానికి సిద్ధమవుతున్నారు ట్రంప్. అక్కడ 6 వందల బిలియన్ డాలర్లు వెచ్చించి ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవడానికి సన్నద్ధమయ్యారు. ఎలాగైనా గ్రీన్‌లాండ్‌ను తమది అనిపించుకోవాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్.. ఇక డానిష్ దేశానికి డబ్బు ఆశ చూపుతున్నారు.
గ్రీన్‌లాండ్ నేలపై కరెన్సీ నీడను పరచడానికి ట్రంప్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. నేటి ప్రపంచంలో డబ్బుతో అసాధ్యం కానిది ఏదీ లేదని నమ్మేవాళ్లలో ఒకరైన ట్రంప్.. డబ్బు అనే వలతో స్వేచ్ఛను బందించే యత్నం చేస్తున్నారు. ఈ మేరకు గ్రీన్‌లాండ్ (Greenland) ప్రజలకు డొనాల్డ్ ట్రంప్ భారీ ఆఫర్ చేశారు. స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తే ఆరు వందల బిలియన్ డాలర్లు చెల్లిస్తానని ప్రకటించారు ట్రంప్. ఇలా అక్కడ ప్రజల్ని ముందుగా ఖాళీ చేయించే యత్నం చేస్తున్నారు.
ఈసారి గ్రీన్‌లాండ్ ప్రజలే టార్గెట్..
గ్రీన్‌లాండ్ అంటే అమెరికాకు అమితమైన ఆసక్తి. అందులోనూ ఈ దీవిపై ట్రంప్‌నకు ఆసక్తి మరీ ఎక్కువ. 2019లో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలోనే గ్రీన్‌లాండ్‌పై బేరసారాలు జరిపారు. అప్పుడు ప్రభుత్వానికి డబ్బు ఆఫర్‌ను ప్రతిపాదించారు ట్రంప్.. అయితే దాన్ని డెన్మార్క్ తిరస్కరించింది. కానీ రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్ మరోసారి కూడా డబ్బును వెదజల్లడానికి సిద్ధమయ్యారు. ఈసారి డెన్మార్క్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి.. గ్రీన్‌లాండ్ ప్రజలకు భారీ ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అక్కడ ఉండే వారికి ప్రతీ వ్యక్తికి 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకూ ఇచ్చి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఒకవేళ ట్రంప్ చూపే ఆశకు గ్రీన్‌లాండ్‌లో ఉండే వాళ్లు సిద్ధమైతే మాత్రం.. ఆ ప్రాంతాన్ని సునాయాసంగానే ట్రంప్ దక్కించుకునే అవకాశం ఉంటుంది.
డబ్బు వలలో స్వేచ్ఛ బందీ కానుందా?
గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ వ్యూహం మార్చడంతో డెన్మార్క్‌కు అంతా గందరగోళంగా ఉంది. డెన్మార్క్ నుంచి గ్రీన్‌లాండ్‌ను వేరు చేయడానికి చూస్తున్న ట్రంప్‌ను ఎదుర్కోవడానికి ఏం చేయాలనే యోచనలో ఉంది డెన్మార్క్ ప్రభుత్వం. ట్రంప్ ప్రకటించిన ఆఫర్‌కు గ్రీన్‌లాండ్ ప్రజలు లొంగితే ఇక తాము ప్రత్యక్ష యుద్ధంలోకి దిగకతప్పదనే భయం పట్టుకుంది. అగ్రరాజ్యం అమెరికా ఎదిరించి నిలబడటం అంత ఈజీ కాదని డెన్మార్క్‌కు తెలుసు. పోని వేరే దేశాలేమైనా సాయం చేస్తాయంటే అది ఎంతవరకూ జరుగతుందో అనేది చూడాలి. రష్యా, చైనా (China) వంటి దేశాలు డెన్మార్క్‌కు సాయం చేస్తే తప్పితే, గ్రీన్‌లాండ్‌ను కాపాడుకోవడం డెన్మార్క్‌కు అత్యంత కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.
ప్రత్యేకమైన దీవి ఇది..
ఉత్తర అమెరికా, యూరప్ ఖండాలక ఇది సరిగ్గా మధ్యలో ఉంటుంది. ప్రధానంగా ఖండాంతర క్షిపణులు మందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు ఇది అనువైనది. అమెరికా సైన్యానికి వ్యూహాత్మకమైన ప్రాంతంగా కూడా ఉపయోగపడుతుంది. రష్యా నావికా దళంపై అమెరికా ఎప్పుడూ కన్నేసి ఉంచడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు అది సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాంతో అమెరికా సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా కీలకం. అంతేగాక ఖండాంతర క్షిపణుల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయవ్య గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్‌లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరముంది. ఇక్కడి నుంచి రష్యా నావికా దళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉంచవచ్చు కూడా.
ఖనిజాల సంపదకు పెట్టింది పేరు..
అత్యంత అరుదైనవిగా ప్రకటించిన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్‌లాండ్‌లో అపారంగా ఉన్నట్టు తేలింది. అమెరికా ఈ ఖనిజాల కోసం చాలాకాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. చైనాపై విధించిన భారీ టారిఫ్‌లను కూడా అంతే వేగంగా ట్రంప్ వెనక్కు తీసుకోవడానికి ఈ ఖనిజాల ఎగుమతిపై డ్రాగన్ నిషేధం విధించడమే ప్రధాన కారణం.
గ్రీన్‌లాండ్ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనాను బెదిరించే దురవస్థ ఉండదన్నది ట్రంప్ యోచనగా ఉంది. ఈ దీవి 7 దశాబ్దాల క్రితమే డెన్మార్క్‌లో భాగంగా మారింది. కాకపోతే 2019లో గ్రీన్‌లాండ్‌కు విస్తృత స్వయం పాలిత ప్రాంతంగా గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద దీవిగా ఉన్న గ్రీన్‌లాండ్.. డెన్మార్క్ నియంత్రణలోనే ఉంది. ప్రస్తుత గ్రీన్‌లాండ్ జనాభా కూడా లక్ష లోపే ఉంది. వారి జనాభా సుమారు 57 వేలు ఉండొచ్చని అంచనా..


