అమెరికా అప్రమత్తం.. పశ్చిమాసియాకు మరిన్ని దళాలు..! | US increased army forces after Iran attacks on Gulf countries | Sakshi
Sakshi News home page

US Army: అమెరికా అప్రమత్తం.. పశ్చిమాసియాకు మరిన్ని దళాలు..!

Mar 4 2026 4:45 AM | Updated on Mar 4 2026 12:27 PM

US increased army forces after Iran attacks on Gulf countries

పశ్చిమాసియాలో యుద్ధంపై అమెరికా మరింత అప్రమత్తమైంది. ఇరాన్‌ పెద్దఎత్తున దాడులకు దిగడంతో అమెరికా సైతం సైనిక మోహరింపును మరింత పెంచింది.  ఈ అత్యవసర చర్య మిత్రదేశాల భద్రత కోసమేనని తెలిపింది.  ఈ ప్రాంతంలో యుద్ధ విమానాలు మరియు యుద్ధనౌకలు ఇప్పటికే మోహరించినప్పటికీ.. కొత్త సైనిక బలగాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టింది.

ఇరాన్‌తో  పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగడంతో యూఎస్ రక్షణ శాఖ పెద్ద సంఖ్యలో మరిన్ని దళాలను మోహరించాలని ఆదేశించింది. అంతేకాకుండా గల్ఫ్ ప్రాంతం అంతటా హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్ ఎదురుదాడితో అప్రమత్తమైన అమెరికా సైనిక స్థావరాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేసింది. మరోవైపు ప్రస్తుత జరుగుతోన్న యుద్ధంతో ప్రపంచ మార్కెట్లు, చమురు ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనే ఆందోళన నెలకొంది. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలు జరుగుతున్నా.. రెండు వైపులా ఎవరు కూడా తగ్గకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరాన్‌- అమెరికా చర్చలు జరిగే పరిస్థతులు ఏ మూలానా కనిపించడం లేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement