అమెరికా-ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్, అమెరికా సైతం ఇరాన్‌పై దాడులు ముమ్మరం చేశాయి. అయితే తాజాగా అమెరికా, ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన ఫతా-2 హైపర్‌సోనిక్ క్షిపణిని మోహరించింది. ఫతా-2 క్షిపణిని మోహరించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. ఫతా బాలిస్టిక్ క్షిపణి అప్‌గ్రేడ్ వెర్షన్ అని ఫతా-2 క్షిపణిగా తెలుస్తోంది. ఈ క్షిపణిని ప్రయోగిస్తున్నట్లు ఇరాన్ ఇంకా ధృవీకరించకపోయినా.. దేశ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ హత్య ఈ ఫతా-2 వంటి క్షిపణులను ఉపయోగించి ఉండవచ్చని ఓ మ్యాగజైన్ కథనం ప్రచురించింది.
ఫతా-2 హైపర్‌సోనిక్ క్షిపణి ప్రభావం..
ఈ హైపర్‌సోనిక్ క్షిపణి ఫతా-2ను నవంబర్ 2023లో ఎలైట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రవేశపెట్టింది. ఇది సంప్రదాయ బాలిస్టిక్ క్షిపణి రీఎంట్రీ వాహనానికి బదులుగా.. హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనాన్ని ఉపయోగించేందుకు రూపొందించారు. ఇది ఊహించని దిశల నుండి లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడనుందని సమాచారం.ఈ ఫతా-2 క్షిపణి 1,400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. మాక్ 15 వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి సంప్రదాయ క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలదని తెలిపారు. ఈ హైపర్‌సోనిక్ క్షిపణి శక్తివంతమైన 200 కిలోగ్రాముల వార్‌హెడ్‌ను మోయగలదని వెల్లడించారు.
కాగా.. టెహ్రాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులను ప్రారంభించింది. యుఎఇ, బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. ఈ దాడులు స్థావరాలు, నౌకాదళ ప్రధాన కార్యాలయాలు సహా అమెరికా రాయబార కార్యాలయాలు, సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని దాడుల చేస్తోంది. దీనివల్ల గల్ఫ్ వైమానిక రక్షణ వ్యవస్థలకు తీవ్ర అటంకం కలుగుతోంది. ఈ దాడులతో ప్రభావిత ప్రాంతాలలో ప్రాణనష్ట, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి.


