భారతపై 500 శాతం సుంకాలకు రెఢీ అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసు మరోసారి బయటపడింది. ఇప్పటికే వరస సుంకాలతో భారత్‌న ఇరకాటంలో పెట్టడానికి యత్నించిన ట్రంప్.. త్వరలో 500 శాతం సుంకాల భారాన్ని వేసే దిశగా పావులు కదుపుతున్నాడు. అయితే దీనిపై ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు , అమెరికా వాణిజ్య కార్యదర్శి లట్నిక్ తొలిసారి పెదవి విప్పారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. అమెరికాతో భారత్ బంధం ఈ రకంగా మారడానికి గల కారణాలు వెల్లడించారు.
‘యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత ప్రధాని మోదీ ఎటువంటి ఫోన్ చేయలేదు. ట్రంప్‌కు ఫోన్ చేసి వాణిజ్య ఒప్పందం గురించి మోదీ ఏమీ మాట్లాడలేదు. భారత్-అమెరికాల వాణిజ్య ఒప్పందానికి తానొ డీల్‌ను సిద్ధం చేశాను. అయితే అది తుదిరూపం దాల్చలేదు. ఎందుకంటే భారత్ ప్రధాని మోదీ నుంచి మాకు ఎటువంటి ఫోన్ రాలేదు’ అందుకే సుంకాలన అత్యధికంగా విధించాలని ట్రంప్ సిద్ధమయ్యారు అని వెల్లడించారు.
ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో వచ్చే వారం అనేక వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం. కానీ భారత్‌తో ఒప్పందం వాటి కంటే ముందే పూర్తవ్వాల్సింది.ఇతర దేశాల కంటే ముందే భారత్‌తొ ఒప్పందం పూర్తవ్వాల్సింది. నేను వారితో ఎక్కువ శాతం చర్చలు జరిపాను’ అని లట్నిక్ తెలిపారు.
BIG BREAKING: India trade deal isn't done because PM Modi did not call Trump, claims US Commerce Secretary Lutnick
"I set the deal up. But you had to have Modi call President Trump. They (India) were uncomfortable with it. So Modi didn't call." pic.twitter.com/gFiUGGaJRl— Shashank Mattoo (@MattooShashank) January 9, 2026
కాగా, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించాలన్న పట్టుదలతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్ బాంబు సిద్ధం చేశారు. అమెరికా హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై ఏకంగా 500% టారిఫ్‌లు విధించడానికి ఉద్దేశించిన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రష్యా నుంచి చమురు ఎవరూ కొనకుండా ఆంక్షలు విధించబోతున్నారు. ఆంక్షలను ఉల్లంఘించే దేశాలపై సుంకాల మోత మోగనుంది. ఈ మేరకు రూపొందించిన బిల్లుపై అమెరికా కాంగ్రెస్‌లో త్వరలోనే ఓటింగ్ జరగనుంది. అక్కడ ఆమోదం పొందితే భారత్, చైనా ఉత్పత్తులపై 500 శాతం సుంకాలు విధించే అధికారం ట్రంప్‌కు లభిస్తుంది.


