గాజా సిటీ: ఉత్తర గాజాలో హమాస్ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్మూలించే లక్ష్యంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎప్) తన ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేసింది. వ్యూహాత్మక ప్రాంతమైన ‘ఎల్లో లైన్’ వెంబడి ఐడీఎఫ్ దళాలు భారీ స్థాయిలో విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను సంపూర్ణంగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం మరో విజయం సాధించింది.
ఈ ఆపరేషన్‌లో భాగంగా తాజాగా భూగర్భంలోని రహస్య హమాస్ నెట్‌వర్క్‌ను ఐడీఎఫ్ ఛేదించింది. సుమారు రెండు కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగ మార్గాన్ని ఇజ్రాయెల్ దళాలు గుర్తించాయి. దీనిని హమాస్ తన కార్యకలాపాలకు, ఆయుధాల తరలింపునకు ఉగ్రవాదుల ఆశ్రయం కోసం ఉపయోగిస్తున్నట్లు సైనిక వర్గాలు ధృవీకరించాయి. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ సొరంగం విస్తృతిని అంచనా వేసిన ఇజ్రాయెల్ దళాలు దానిని ధ్వంసం చేసే ప్రక్రియను చేపట్టాయి.
Hamas thought they were safe underground. Not anymore.
The IDF just took out 2km of terror tunnels in northern Gaza. pic.twitter.com/yTWECZ7rpm— Hananya Naftali (@HananyaNaftali) January 4, 2026
ఎల్లో లైన్ వెంట జరుగుతున్న ఈ ఆపరేషన్ కేవలం భూగర్భానికే పరిమితం కాలేదు. ఉపరితలంపైన, భూగర్భంలో ఉన్న అన్ని రకాల ఉగ్రవాద మౌలిక సదుపాయాలను విడతల వారీగా అధికారులు తొలగిస్తున్నారు. హమాస్ స్థావరాలను, ఆయుధ డిపోలను, కమ్యూనికేషన్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని ఐడిఎఫ్ బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఉత్తర గాజాలో ఉగ్రవాదులపై నియంత్రణ సాధించడం అత్యంత కీలకమని సైనిక నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఈ క్లీనింగ్ ఆపరేషన్ ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఎల్లో లైన్ వెంబడి ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, ఉగ్రవాదులు మళ్లీ ప్రవేశించకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఐడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు. కాగా ఈ భారీ సొరంగం విధ్వంసం హమాస్ సామర్థ్యంపై భారీ దెబ్బ అని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: అమెరికాలో ‘అహింసా మంత్రం’


