ప్రముఖ నటుడు మోహన్ బాబు.. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా శనివారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
మోహన్ బాబు కుటుంబంతో పాటు సూపర్‌స్టార్ రజనీకాంత్, జయసుధ, సుమలత, బ్రహ్మానందం, నాజర్, నాని, రామ్ గోపాల్ వర్మ, జాకీ ష్రాఫ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.


