ఒక చిత్రమే..రెండుగా రూపాంతరం..! ఈ టాలెంట్‌కి మాటల్లేవ్‌ అంతే.. | Akbar Momin 69 Year Old Artist portraits that transform different In A Mirror | Sakshi
Sakshi News home page

ఒక చిత్రమే..రెండుగా రూపాంతరం..! ఈ టాలెంట్‌కి మాటల్లేవ్‌ అంతే..

Nov 20 2025 1:00 PM | Updated on Nov 20 2025 1:30 PM

Akbar Momin 69 Year Old Artist portraits that transform different In A Mirror

ఒక చిత్రం గీశాక..అది అద్దం ముందు మరో చిత్రంలా అగుపించడం అంటే మాములు టాలెంట్‌ కాదు. ఇలాంట నైపుణ్యాన్ని ఆప్టికల్‌ ఇల్యూషన్‌ అని పిలస్తారు. అలాంటి స్కిల్‌ని పుణికిపుచ్చుకున్నాడు 69 ఏళ్ల వ్యక్తి. ఎంత అద్భుతంగా ఇద్దరు వ్యక్తులను ఒక చిత్రంలో పొందుపరిచి..అద్దం చూపగానే మరొకరిలా కనిపిస్తుంది. నేరుగా చూస్తే..ఇంత టాలెంటా.. ? అని విస్తుపోవడం మనవంతు అవుతుంది. అంతలా అద్భుతంగా చిత్రిస్తాడు. అతడి ఆర్ట్‌ నైపుణ్యానికి మాటల్లేవ్‌ అంతే..! అనేయొచ్చు.

అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. అతడే అక్బర్ మోమిన్. గుజరాత్‌లోని సిధ్‌పూర్‌కు చెందిన అక్బర్‌ తన అద్భుతమైన.. భ్రమని కల్పించే చిత్రాలకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నారు. ఆయన్ను అంతా త్రీడీ ఆర్టిస్టు అని పిలుస్తారు. ఎందుకంటే చిత్రించిన ప్రతి బొమ్మ మరోలా ఏదో మాయ చేసినట్లుగా కనిపిస్తుంది. 

ఒక వ్యక్తి చిత్రపటం ముందు అద్దం పెట్టగానే మరొక వ్యక్తిని ప్రతిబింబిస్తుంది. కాస్త షాకింగ్‌కి గురిచేసే ఆర్ట్‌ ఇది. ఆయన పంచుకున్న వీడియో ఒకదానిలో రాముడి పెయింటింగ్‌ అద్దంలో హనుమాన్‌ జీగా కనిపిస్తుంది. అత్యంత నేచురుల్‌గా ఉండే  ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఎవ్వరినైనా ఇట్టే మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక మరో వీడియోలో ప్రధాని మోదీ చిత్రపటం ముందు అద్దం ఉంచగానే అమిత్‌షా కనిపిస్తారు. 

అక్కడ ఏదో మిరాకిల్‌ జరిగిందా అన్నట్లుగా.. ఒక ఇమేజ్‌ మరొలా కనిపిస్తుంది. 45 ఏళ్లుగా అక్బర్‌ ముంబైలో ఈ ఆర్ట్‌పై మంచి ప్రావీణ్య సంపాదించి..తన స్వస్థలానికి తిరిగి వచ్చి ఒక స్టూడియోను ప్రారంభించారు. ఇప్పుడు ఈ స్టూడియో ప్రతి వారాంతంలో కళాప్రియులను అమితంగా ఆకర్షిస్తోంది. అతని కళా నైపుణ్యం ఉమ్మడి సాంస్కృతిక స్ఫూర్తిని చాలా అందంగా సూచిస్తోంది. 

ప్రతి పెయింటింగ్‌ వెనుక మరో వ్యక్తిని దాచిపెడుతూ..ఏకకాలంలో ఇద్దరు వ్యక్తులను చూసే విలక్షణమైన ఆర్ట్‌ ఇది. ఈ ఆర్ట్‌ సృజనాత్మకతకు, సాంకేతికత దూరదృషికి సంబంధించిన అసాధారణ స్కిల్‌. ఇంకెందుకు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోలపై ఓ లుక్‌ వేయండి మరి. 

(చదవండి: పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్‌ కౌంటర్‌)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement