అహ్మదాబాద్: లంచానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గుజరాత్‌లో ఓ ఐఏఎస్ అధికారిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. 2015 బ్యాచ్ ఐఏఎస్ అయిన రాజేంద్ర కుమార్ పటేల్ సురేంద్రనగర్ కలెక్టర్‌గా పనిచేస్తుండగా వారం క్రితం హఠాత్తుగా ఎటువంటి పోస్ట్ ఇవ్వకుండానే ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. మోరి తదితరులపై నమోదైన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు దర్యాప్తు చేస్తోంది. ఈడీ ఫిర్యాదు మేరకు గుజరాత్ ఏసీబీ వేరుగా పటేల్, ఆయన వ్యక్తిగత సహాయకుడు జయరాజ్ ఝాలా తదితరులపై కేసు నమోదు చేసింది.
డిసెంబర్ 23వ తేదీన మోరీ ఇంట్లో ఈడీ సోదాలు జరపగా రూ.67.5 లక్షలు దొరికాయి. అదంతా లంచం సొత్తేనని విచారణలో మోరి అంగీకరించాడు. భూ వినియోగానికి సంబంధించిన దరఖాస్తులను త్వరితంగా పరిష్కరించినందుకు గాను లంచం తీసుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. దర్యాప్తు మరింత చేపట్టిన ఈడీ..ఈ మొత్తం వ్యవహారంలో కలెక్టర్ సహా ఆ కార్యాలయంలోని అధికారుల అందరి ప్రమేయం ఉన్నట్లు తేలి్చంది. వీరు భూమి చదరపు మీటర్ చొప్పున లెక్కకట్టి మరీ లంచం తీసుకుని లంచం తీసుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు శుక్రవారం ఈడీ బృదం రాజేంద్ర కుమార్ పటేల్‌ను అరెస్ట్ చేసింది.


