పురాతన శివాలయం : వందల సంఖ్యలో పాములు,వీడియో వైరల్‌ | Snakes in krishna river at nagayalanka temple devotees shocks Karthika masam | Sakshi
Sakshi News home page

పురాతన శివాలయం : వందల సంఖ్యలో పాములు, వీడియో వైరల్‌

Nov 20 2025 3:45 PM | Updated on Nov 20 2025 4:14 PM

Snakes in krishna river at nagayalanka  temple devotees shocks Karthika masam

పవిత్ర కార్తీకమాసంలో  చోటు చేసుకున్న అరుదైన ఘటన ఒకటి భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ పురాతన శివాలయంలో ఉన్నట్టుండి కుప్పలుగా  సర్పాలు కనిపించాయి. ఒ‍కటీ రెండూ కాదు ఏకంగా వందల సంఖ్యలో తిరుగాడుతున్న దృశ్యం అందరినీ విస్మయానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది.

చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్‌ కూడా!

కృష్ణా జిల్లా నాగాయలంకలో  రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నవంబరు  19న ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతీ ఏటా కార్తీకమాసంలో ఇలా పాములు గుంపులుగా కనిపించడం తమకు అలవాటే అంటున్నారు స్థానికులు.  కానీ ఈ ఏడాది వీటి సంఖ్య కాస్త ఎక్కువగా ఉందని తెలిపారు. ఇదంతా ఆ కార్తీక దామోదరుడి మహిమే అంటూ  ఆ శివయ్యకు మొక్కుకోవడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement