సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: పోలీసుల ఘోర వైఫల్యంతో దారుణ హత్య చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంతో కొందరు ఓ వ్యక్తిని నరికి చంపారు. కదిరి నియోజకవర్గంలో పరిధిలోని తనకల్లు పీఎస్ వద్ద.. అదీ పోలీసులు చూస్తుండగానే ఈ ఘోరం చోటు చేసుకుంది.
సత్యసాయి జిల్లాకు చెందిన ఈశ్వరప్ప అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఓ వివాహితను గూడూరు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై ఫిర్యాదు ఆమె భర్త హరి, బంధువులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. అయితే వాళ్లిద్దరి జాడ గుర్తించిన పోలీసులు.. గూడూరు నుంచి తనకల్లు తీసుకొచ్చారు.
గత రాత్రి సమయంలో పోలీసు జీపు దిగిన వెంటనే ఈశ్వరప్పను హరి, అతని బంధువులు కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనతో పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈశ్వరప్ప తరలింపు వ్యవహారంలో తనకల్లు ఎస్సై గోపి తగిన జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టమవుతోంది.


