పంట పెట్టుబడి..తక్కువ అధిక అధాయం వస్తే ఏ రైతు అయినా సంతోషంతో ఎగిరిగంతేస్తాడు. అది కూడా సాదాసీదా చిన్న పంటగా వేసిందే ఊహించని రేంజ్‌లో లాభం వస్తే ఆ సంతోషానికి అవధులు ఉండవు కదా..!. అలాంటి ఆనందంతోనే తడిసిముద్దవుతోంది ఈ యువ రైతు శివానీ పవార్. మరి ఆమె ఈ సక్సెస్ ఎలా అందుకుందంటే..
మధ్యప్రదేశ్‌కి చెందిన యువ రైతు శివానీ తాను ఎలా చిన్న పంటతో తక్కువ టైంలో అధిక లాభం ఆర్జించిందో ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో షేర్ చేసుకుంది. అది నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షించడమే గాక ఈవిషయం నెట్టింట వైరల్‌గా మారింది. తాను ఒక చిన్న కొత్తిమీర కట్టతో జస్ట్ 30 రోజుల్లోనే రూ. లక్ష రూపాయాలు లాభం అందుకున్నానని వీడియోలో పేర్కొంది. తన ఖర్చులు, పెట్టుబడి అన్నింటిని తీసేస్తే..9 టు 5 జాబ్ చేసే వారికంటే మెరుగైనా ఆదాయాన్ని ఆర్జించానని అంటోంది.
తన చిన్న పొలంలో కొత్తిమీర పంట వేశానని, అది 30 రోజుల్లోనే కోతకు వచ్చిందని వివరించింది. ఆ తర్వాత అమ్మకాలు రూ. 1.25 లక్షలకు చేరాయని పేర్కొంది. తనకు ఈ పంటకు, విత్తనాలు, ఎరువు, కూలీ, నీటి పారుదల..ఇలా అన్నింటికి కలిపి మొత్తం రూ. 16,000లే ఖర్చు అయ్యాయని చెప్పుకొచ్చింది. రోజువారి వంటలో ఉపయోగించే కొత్తిమీరకు తక్కువ పెట్టుబడి అవుతుందని, అయితే స్వల్పకాలంలోనే అధిక టర్నోవర్‌ని ఇచ్చే పంట అని వెల్లడించింది. శీతాకాలంలో ఈ ఆకుకూరకు అధిక డిమాండ్ ఉంటుందని..అదే తాను క్యాష్ చేసకున్నట్లు పేర్కొంది.
కొత్తిమీర సాగు..
నేల వాతావరణాన్ని బట్టి కొత్తిమీర సాధారణంగా 30 నుంచి 40 రోజుల్లో ఎకరానికి ఐదు నుంచి పది టన్నుల దిగుబడి వస్తుందట. ఇలాంటి పంటలు వేయాలనుకునే రైతులు ప్రధానంగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే..నీటి పారుదల, సరైన విత్తనాలు, పంటను సరిగా నిర్వహించడం తదితరాల పట్ల కేర్‌గా ఉండాలని అంటోంది శివాని.
తక్కువకాలంలో లాభం అందించే ఈ చక్ర వ్యవసాయం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. చాలామంది యువ రైతులు ఈ చక్ర వ్యవసాయం ట్రెండ్‌నే అనుసరిస్తున్నారు. అలాంటి చక్ర వ్యవసాయం పంటలు ఏంటంటే..పచ్చి ఉల్లిపాయలు, పాలకూర, మెంతులు, త్వరితగతిన ఆదాయం ఇచ్చే పంటలట. ప్రస్తుతం ఈ చక్ర వ్యవసాయం అనేక రాష్ట్రాల్లో విస్తరిస్తోంది కూడా.
(చదవండి: ఒక చిత్రమే..రెండుగా రూపాంతరం..! ఈ టాలెంట్‌కి మాటల్లేవ్ అంతే..)


