టాలీవుడ్‌లో 'సీతారామం' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తొలి చిత్రంతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటి మృణాల్ ఠాకూర్‌ని ఈబీజీ గ్రూప్ తమ ప్రీమియం వెల్నెస్ & హాస్పిటాలిటీ ప్లాట్‌ఫామ్ కార్ల్టన్ వెల్నెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.
2022లో విడుదలైన 'సీతారామం' సినిమాలో సీత మహాలక్ష్మి పాత్రలో నటించి, దుల్కర్ సల్మాన్‌తో జోడీ కట్టిన మృణాల్... తన సహజమైన అభినయం, గ్రేస్‌ఫుల్ లుక్‌తో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది.
ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో మృణాల్ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా నిలిచింది.
ఆ తర్వాత 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' వంటి చిత్రాలతో తన సత్తా చాటింది.
జనాల్లో ఆమెకున్న క్రేజీ దృష్ట్యా.. ఈబీజీ గ్రూప్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా మృణాల్‌ని ఎంచుకుంది.
కార్ల్టన్ వెల్నెస్ బ్రాండ్ ఫిల్మ్‌లు, డిజిటల్ కథన క్యాంపెయిన్‌లు, ఎక్స్‌పీరియెన్షియల్ వెల్నెస్ ఈవెంట్‌లు, ఫ్లాగ్‌షిప్ ప్రాపర్టీ లాంచ్‌లు, ఇతర బ్రాండ్ ప్రోగ్రామ్‌లలో మృణాల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.


