మహిళలపై ఆన్‌లైన్ దాడులు చేస్తే తప్పించుకోలేరు : మహిళా కమిషన్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద
హైదరాబాద్ : ఆన్‌లైన్ వేధింపులు, బెదిరింపులపై మహిళా జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదుపై మహిళా కమిషన్ స్పందించింది. తక్షణమే డీటైల్డ్ ఎంక్వైరీ చేసి వెంటనే నివేదిక సమర్పించాలని తెలంగాణ DGPకి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద తక్షణమే స్పందించిన తీరుపై మహిళా జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు.
మహిళల గౌరవం, భద్రత, స్వేచ్ఛాయుత అభిప్రాయ వ్యక్తీకరణను కాపాడటం తమ ప్రాధాన్యత అని నేరెళ్ల శారద స్పష్టం చేశానేజ.మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న ఆన్‌లైన్ హరాస్‌మెంట్, బెదిరింపులు, అసభ్య వ్యాఖ్యలపై సమన్స్ జారీ చేశామన్నారు. ఈ విషయంలో మహిళా కమిషన్ ఎల్లప్పుడూ ముందుండి కఠిన చర్యలు తీసుకుంటుంది ఆమె వెల్లడించారు. మహిళలపై ఇలాంటి దాడులు చేస్తే తప్పించుకునే అవకాశం ఉండదని కూడా ఆమె హెచ్చరించారు. కాగాఆన్ లైన్ వేదింపులపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నవంబర్ 18న హైదరాబాద్ మహిళా జర్నలిస్టు బృందం మహిళాకమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ వేధింపులపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు
మీరు అందించిన సమాచారంపై తెలంగాణ మహిళా కమిషన్ వెంటనే స్పందించి చర్యలు ప్రారంభించింది. మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న ఆన్‌లైన్ హరాస్‌మెంట్, బెదిరింపులు, అసభ్య వ్యాఖ్యలపై సమన్స్ జారీ చేసి, సంబంధిత వ్యక్తులపై విచారణకు DGP గారికి అధికారిక నివేదన పంపించాం.
మహిళల గౌరవం, భద్రత, మరియు… https://t.co/JOBIFZNVSG pic.twitter.com/03HltE8hRz— Sharada Nerella (@sharadanerella) November 20, 2025


