breaking news
nerella sarada
-
మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు: డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు
హైదరాబాద్ : ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులపై మహిళా జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదుపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. తక్షణమే డీటైల్డ్ ఎంక్వైరీ చేసి వెంటనే నివేదిక సమర్పించాలని తెలంగాణ DGPకి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద తక్షణమే స్పందించిన తీరుపై మహిళా జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. మహిళల గౌరవం, భద్రత, స్వేచ్ఛాయుత అభిప్రాయ వ్యక్తీకరణను కాపాడటం తమ ప్రాధాన్యత అని నేరెళ్ల శారద స్పష్టం చేశారు. మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న ఆన్లైన్ హరాస్మెంట్, బెదిరింపులు, అసభ్య వ్యాఖ్యలపై సమన్స్ జారీ చేశామన్నారు. ఈ విషయంలో మహిళా కమిషన్ ఎల్లప్పుడూ ముందుండి కఠిన చర్యలు తీసుకుంటుంది ఆమె వెల్లడించారు. మహిళలపై ఇలాంటి దాడులు చేస్తే తప్పించుకునే అవకాశం ఉండదని కూడా ఆమె హెచ్చరించారు. కాగా ఆన్లైన్ వేధింపులపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నవంబర్ 18న హైదరాబాద్ మహిళా జర్నలిస్టు బృందం మహిళా క మిషన్కు ఫిర్యాదు చేసింది. ఇదీ చదవండి: ఆన్లైన్ వేధింపులపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు మీరు అందించిన సమాచారంపై తెలంగాణ మహిళా కమిషన్ వెంటనే స్పందించి చర్యలు ప్రారంభించింది. మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న ఆన్లైన్ హరాస్మెంట్, బెదిరింపులు, అసభ్య వ్యాఖ్యలపై సమన్స్ జారీ చేసి, సంబంధిత వ్యక్తులపై విచారణకు DGP గారికి అధికారిక నివేదన పంపించాం.మహిళల గౌరవం, భద్రత, మరియు… https://t.co/JOBIFZNVSG pic.twitter.com/03HltE8hRz— Sharada Nerella (@sharadanerella) November 20, 2025 -
'కొల్లాపూర్ నిందితులను కఠినంగా శిక్షించాలి'
హైదరాబాద్: రాష్ట్రంలో, దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, ఆడపిల్లల్ని బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుందని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారద అన్నారు. ఆమెక్కిడ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కొల్లాపూర్ ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. సీఎం, గవర్నర్ తమకు సమయం కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. అసలు కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. మంత్రి వర్గంలో కనీసం మహిళలకు ప్రాతినిథ్యం లేదని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అని చెబుతున్న ప్రభుత్వం వారికి రక్షణ కల్పించలేకపోతున్నదని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ లేఖ ద్వారా సీఎంను ప్రశ్నించనున్నట్లు తెలిపారు. -
కవిత అలా అనడం సరికాదు: శారద
-
కవిత అలా అనడం సరికాదు: శారద
హైదరాబాద్ : బతుకమ్మ వేడుకలకు కేసిఆర్ ప్రభుత్వం పది కోట్లు విడుదల చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుపట్టింది. గత ఏడాది ప్రభుత్వ నిధులన్నీ కేసిఆర్ కూతురు కవిత పాల్గొన్న బతుకమ్మ కార్యక్రమాలకే ఖర్చు చేశారని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆరోపించారు. ఓ వైపు రాష్ట్రంలో రైతులు, ఆశా వర్కర్లు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే...మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత మాత్రం బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలనడం సరికాదన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ కవిత హడావుడి చేయడం వారిని అవమానించడమే అవుతుందని శారద విమర్శించారు. దత్తత తీసుకోవడానికి ఆ కుటుంబాలు అనాధలు కావని... వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ ఆమె చేశారు. -
'పుష్కర ఏర్పాట్లు అగమ్యగోచరం'
కాళేశ్వరం: త్రివేణి సంగమమైన కాళేశ్వర పుణ్య క్షేత్రంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు అగమ్యగోచరంగా ఉన్నాయని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద విమర్శించారు. బుధవారం ఆమె కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. లక్షలాది మంది భక్తులు వచ్చే క్షేత్రంలో పుష్కరాల కోసం కనీస ఏర్పాట్లు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఘాట్ల వద్ద కనీస సౌకర్యాలు లేవని, ఎండవేడిమి పెరగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పుష్కరాల్లో ఇంకా 10 రోజులు మిగిలి ఉన్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకుని కనీస వసతులు కల్పించాలని కోరారు.


