గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తిక మాసం, తిథి: బ.చతుర్దశి ఉ.8.34 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: స్వాతి ఉ.7.53 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: ప.2.04 నుండి 3.50 వరకు, దుర్ముహూర్తం: ప.11.23 నుండి 12.08 వరకు, అమృత ఘడియలు: రా.12.40 నుండి 2.25 వరకు.
సూర్యోదయం : 6.10
సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం... కుటుంబసభ్యులతో సఖ్యత. భూలాభాలు. బాకీలు వసూలవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృషభం.... పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.
మిథునం..... ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. పనులలో జాప్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
కర్కాటకం... వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ప్రయాణాలు వాయిదా. సోదరులు, సోదరీలతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
సింహం.... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు.
కన్య.... వ్యయప్రయాసలు. మిత్రులు, ఆప్తులతో మాటపట్టింపులు. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
తుల.... ఉద్యోగయోగం. ధనప్రాప్తి. యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.
వృశ్చికం..... ప్రయాణాలలో మార్పులు. వృథా ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
ధనుస్సు.... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి.
మకరం.... శుభకార్యాలలో పాల్గొంటారు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. ఆహ్వానాలు రాగలవు. వృత్తి, వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి.
కుంభం... సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
మీనం,.... అనుకున్న పనులు మధ్యలో విరమిస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.


