గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: శు.త్రయోదశి రా.8.49 వరకు, తదుపరి చతుర్దశి,నక్షత్రం: రోహిణి రా.9.53 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ప.2.27 నుండి 3.56 వరకు, తదుపరి రా.3.07 నుండి 4.37 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.19 నుండి 11.03 వరకు, తదుపరి ప.2.44 నుండి 3.28 వరకు, అమృత ఘడియలు: సా.6.55 నుండి 8.24 వరకు.
సూర్యోదయం : 6.34
సూర్యాస్తమయం : 5.32
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం... కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి. బంధువర్గంతో విభేదిస్తారు. శారీరక రుగ్మతలు. ముఖ్యమైన కార్యాలలో తొందరపాటు. వ్తృత్తులు, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
వృషభం... సన్నిహితుల నుంచి ధనసాయం అందుతుంది. వాహనసౌఖ్యం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.. వృత్తులు, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
మిథునం... ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. చిత్రమైన సంఘటనలు. వృత్తులు, వ్యాపారాలలో సమస్యలు.
కర్కాటకం... కొత్త కార్యాలు చేపడతారు. బంధువులు, స్నేహితుల చేయూతతో ముందుకు సాగుతారు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తులు, వ్యాపారాలలో అనుకూల వాతావరణం.
సింహం... కుటుంబంలో శుభకార్యాలు. స్వల్ప ధనలబ్ధి. సమస్యలు కొన్ని పరిష్కారం. సోదరుల నుంచి ధనలాభం. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూరప్రయాణాలు.
కన్య.... కొన్ని పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. ఇంటాబయటా వివాదాలు. వృత్తులు, వ్యాపారాలలో నిరుత్సాహం.
తుల... స్నేహితులతో విభేదిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. కష్టానికి ఫలితం కనిపించదు.శారీరక రుగ్మతలు.. వృత్తులు, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు.
వృశ్చికం... కొన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వృత్తులు, వ్యాపారాలలో పురోగతి. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం.
ధనుస్సు.... అనుకున్నదే తడవుగా కార్యాలు పూర్తి చేస్తారు. పట్టుదల పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వృత్తులు, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
మకరం..... కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువర్గంతో విభేదాలు. స్వల్ప రుగ్మతలు. విలువైన వస్తువులు జాగ్రత్త. దైవకార్యాలకు హాజరవుతారు. వృత్తులు, , వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి.
కుంభం... కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. శారీరక రుగ్మతలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తులు, వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి.
మీనం... పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. శుభకార్యాలు వింటారు. సమాజంలో విశేష గౌరవం. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.


