గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: శు.చతుర్దశి రా.6.31 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: మృగశిర రా.8.17 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: తె.4.10 నుండి 5.40 వరకు (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.35 వరకు, తదుపరి ప.12.32 నుండి 1.16 వరకు, అమృత ఘడియలు: ప.12.04 నుండి 1.33 వరకు.
సూర్యోదయం : 6.35
సూర్యాస్తమయం : 5.33
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం... కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. లేనిపోని ఖర్చులు. బంధువులు, స్నేహితులతో విభేదిస్తారు. శారీరక రుగ్మతలు. వృత్తులు, , వ్యాపారాలలో మార్పులు. శ్రమ పెరుగుతుంది.
వృషభం.... కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. ముఖ్యమైన, సమావేశాల్లో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. దైవారాధనలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలో నూతనోత్సాహం.
మిథునం....... ఏ ప్రయత్నమైనా నత్తనడకన సాగుతుంది. వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. వృత్తులు, వ్యాపారాలలో ఒత్తిడులు ఉండవచ్చు.
కర్కాటకం.... కార్యక్రమాలలో విజయం. బంధువుల నుంచి కీలక సమాచారం. చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. వృత్తులు, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు నూతన అవకాశాలు.
సింహం...... ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులతో సఖ్యత. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వృత్తులు, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. కీలక నిర్ణయాలు.
కన్య...... ఆదాయం కొంత మందగిస్తుంది. వథా ఖర్చులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దేవాలయాలు సందర్శిస్తారు. వృత్తులు, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యభంగం.
తుల... ఆదాయానికి మించి ఖర్చులు. బంధువర్గంతో వివాదాలు. కొంత శారీరక రుగ్మతలు. కుటుంబంలో సమస్యలు. దైవకార్యాలలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలు మందగిస్తాయి.
వృశ్చికం... ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. అప్పులు తీరే మార్గం కలుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వృత్తులు, వ్యాపారాలలో అనుకూలత. సమాజంలో గౌరవం.
ధనుస్సు... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితుల తోడ్పాటుతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వస్తులాభాలు. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి.
మకరం... కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. లేనిపోని ఖర్చులు. కష్టానికి ఫలితం కనిపించదు. బంధువులతో విభేదాలు. వృత్తులు, వ్యాపారాలలో నిరుత్సాహం. శారీరక రుగ్మతలు.
కుంభం.... ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. వృత్తులు, వ్యాపారాలలో గందరగోళం. ఆకస్మిక ప్రయాణాలు.
మీనం.. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సమాజంలో విశేష గౌరవం. విలువైన సమాచారం. వృత్తులు, వ్యాపారాలలో ప్రోత్సాహం. కాంట్రాక్టులు లభిస్తాయి. దైవచింతన. దూరప్రయాణాలు.


